YSRCP Nandigama : నగర పంచాయతీ సాధారణ సమావేశం..

YSRCP Nandigama :

 

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.30-9-2022(శుక్రవారం) ..

నగర పంచాయతీ సాధారణ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

చైర్మన్ మండవ వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 89 అంశాలతో కూడిన అజెండాను – 6 అంశాలతో కూడిన టేబుల్ అజెండాను ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు ..

ప్రాధాన్యత క్రమంలో 20 వార్డుల ను అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ మండవ వరలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సాధారణ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొన్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సహకారంతో నందిగామ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని , మునిసిపాలిటీలకు మంజూరైన ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో నందిగామ నగర పంచాయతీ రాష్ట్రంలోనే 6 వ స్థానంలో నిలిచిందని తెలిపారు ,అభివృద్ధే లక్ష్యంగా పలు వర్కులకు సంబంధించిన అంశాలను ఆమోదం కొరకు కౌన్సిల్ సమావేశం ముందుకు తీసుకురావడం జరిగిందని , పట్టణంలోని 20వ వార్డు లో సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు ,ఈ సమావేశంలో నీటి సమస్య గురించి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ప్రశ్నించగా పట్టణ పరిధిలో క్రమంతప్పకుండా నీటిని విడుదల చేస్తున్నామని , అన్ని వార్డుల్లో కొన్ని ఇళ్ళల్లో నగర పంచాయతీ తాగునీటి పంపులకు ప్రవేటు మోటర్లు వినియోగించి నీటిని తోడేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ,గతంలో వర్షాల కారణంగా వరదల కారణంగా కొత్త మున్నేరు -పాత మున్నేరు లో మోటార్లు దెబ్బతినడంవల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని , పాతకాలంనాటి పైపులైన్లు ఉండటంవల్ల లీకేజీ లు ఏర్పడి పలుమార్లు సమస్యలు ఎదురయ్యాయని – వాటన్నిటినీ క్రమంతప్పకుండా సరి చేస్తున్నామని కొత్త పైపులైన్లు ఏర్పాటు చేయటం – వాల్ పీట్లు బిగించడం – రామన్నపేట నుంచి నందిగామ పట్టణానికి వస్తున్న తాగునీటి పైపులైన్ల కు అదనంగా పట్టణ జనాభాకు అనుగుణంగా పైప్ లైన్ కనెక్షన్ లకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించడం జరిగింది అన్నారు , పట్టణంలోని 20వ వార్డు లో గ్రావెల్ తో మట్టి రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపడుతున్నామన్నారు ..

ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నాగరత్నమ్మ , కమిషనర్ జయరాం , ఏఈ ఫణీ శ్రీనివాస్ ,వైసిపి- తెదేపా- జనసేన కౌన్సిల్ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు , మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు ..

 

YSRCP Nandigama : వైయస్సార్ చేయూత వారోత్సవాల్లో..

#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *