Best Web Hosting Provider In India 2024

Kriti Sanon Fake Video With AI: ఈ మధ్య పాపులర్ హీరోయిన్లకు ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ పెద్ద సమస్యగా మారింది. ఇదివరకు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోను కేటుగాళ్లు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారం సృష్టించింది.
ట్రెండింగ్ వార్తలు
సపోర్ట్‌గా
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జారా పటేల్ ముఖం స్థానంలో రష్మిక ఫేస్ పెట్టి ఈ వీడియోను సృష్టించారు. ఈ విషయంపై బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు రష్మిక మందన్నాకు సపోర్ట్‌గా కూడా నిలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత కత్రీనా కైఫ్ మార్ఫింగ్ ఫొటోలు సైతం నెట్టింట్లో హల్ చల్ చేశాయి.
AI టెక్నాలజీతో
ఇప్పుడు తాజాగా బాలీవుడ్ గ్లామరస్ బ్యూటి కృతి సనన్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ మినీ డ్రెస్సులో సేమ్ కృతి సనన్ ముఖంతో ఉన్న ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. AI టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేసిన ఈ వీడియో చాలా వల్గర్‌గా కనిపిస్తోంది. ఈ వీడియో ఫేక్ అంటూ కొంతమంది నెటిజన్స్ అంటుంటే.. మరికొందరూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో మాత్రమే కాదు
ఇలా కృతి సనన్ ఫేక్ వీడియో మాత్రమే కాకుండా శరీర భాగాలు మారుస్తూ క్రియేట్ చేసిన అనేక ఫొటోలు సైతం ఇంటర్నెట్‌లో దర్శనం ఇస్తున్నాయి. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరగడం హర్షించే పని అయినప్పటికీ కొంతమంది మాత్రం దాన్ని ఇలా తప్పుడు మార్గంలో ఉపయోగించడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అవకాశాలు రాకపోవడంతో
ఇదిలా ఉంటే కృతి సనన్ తెలుగు ఇండస్ట్రీలోకి మహేశ్ బాబు వన్ నేనొక్కడినే మూవీతో పరిచయం అయింది. తర్వాత నాగ చైతన్య దోచెయ్ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలు అప్పట్లో బాగా ఆడకపోయేసరికి కృతికి తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్‌లోకి వెళ్లిపోయిన ఈ బ్యూటి అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలే ప్రభాస్ సరసన సీతగా ఆదిపురుష్ మూవీలో నటించి ఆకట్టుకుంది.