Devil Director Instagram Post: నేనే తప్పూ చేయలేదు.. డెవిల్ నా సినిమా: అసలు డైరెక్టర్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Best Web Hosting Provider In India 2024

Devil Director Instagram Post: కల్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ అసలు డైరెక్టర్ నవీన్ మేడారం మధ్యలోనే కొన్ని వివాదాల కారణంగా తప్పుకున్న విషయం తెలుసు కదా. ఆ తర్వాత మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ నామానే డైరెక్టర్ గా తన పేరు వేసుకొని మూవీ రిలీజ్ చేయబోతున్నాడు. దీనిపై మొత్తానికి నవీన్ మేడారం బుధవారం (డిసెంబర్ 27) ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పందించాడు.

 

ట్రెండింగ్ వార్తలు

డెవిల్ మూవీ శుక్రవారం (డిసెంబర్ 29) రిలీజ్ కానుండగా రెండు రోజుల ముందు నవీన్ మేడారం చాలా ఘాటుగా స్పందిస్తూ ఇన్‌స్టాలో ఓ ఓపెన్ లెటర్ రాశాడు. ఈ సినిమా కోసం తాను మూడేళ్లు కష్టపడ్డానని, చివరికి క్రెడిట్స్ లో తన పేరు లేకపోవడం చాలా బాధగా ఉందని అతడు అన్నాడు. తాను ఎవరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోలేదని కూడా తేల్చి చెప్పాడు. అయితే అందరూ ఈ సినిమా చూడాలని కోరడం విశేషం.

నవీన్ మేడారం లేఖలో ఏముందంటే?

“డెవిల్ సినిమాను తీయడానికి మూడేళ్లు శ్రమించాను. స్క్రిప్ట్ తయారు చేయడం నుంచి స్క్రీన్ ప్లే, కాస్ట్యూమ్స్, లొకేషన్లు, సెట్స్.. ఇలా ప్రతిదాంట్లో నా ఆర్టిస్టిక్ విజన్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమాను నేను కరైకూడి, వైజాగ్, హైదరాబాద్ లలో 105 రోజుల పాటు చిత్రీకరించాను. ఇది నాకు ఓ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, నా బేబీ. ఎవరు ఏమన్నా సరే డెవిల్ ఫిల్మ్ బై నవీన్ మేడారం అంతే” అని అతడు రాసుకొచ్చాడు.

చాన్నాళ్లుగా ఈ అంశంలో తాను సైలెంట్ గా ఉన్నానని, దీనిని చాలా మంది తానేదో తప్పు చేసినట్లుగా భావించారని నవీన్ మేడారం చెప్పాడు. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ వివాదానికి అహంకారం, అత్యాశతో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలే కారణమని స్పష్టం చేశాడు. సినిమా క్రెడిట్స్ లో తన పేరు లేకపోవడం చాలా బాధగా ఉందని అన్నాడు.

 

కల్యాణ్ రామ్ ఈ సినిమా కోసం తన 100 శాతం పర్ఫార్మెన్స్ ఇచ్చాడని, ఈ డెవిల్ సినిమాను డిసెంబర్ 29న అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని అతడు కోరాడు. సినిమా క్రెడిట్స్ లో తన పేరు లేకపోయినా.. దీని ద్వారా తనకు లభించిన అమూల్యమైన అనుభవం, నైపుణ్యం, కాన్ఫిడెన్స్ తనతోనే ఉన్నాయని నవీన్ మేడారం అన్నాడు.

శుక్రవారం రిలీజ్ కాబోతున్న డెవిల్ సినిమాలో కల్యాణ్ రామ్ తోపాటు సంయుక్త మేనన్, మాళవికా నాయర్, అజయ్, సత్య లాంటి వాళ్లు నటించారు. ప్రొడ్యూసర్ అభిషేక్ నామాతో విభేదాల కారణంగా మధ్యలోనే నవీన్ మేడారం తప్పుకున్నాడు. దీంతో మూవీకి తానే డైరెక్ట్ చేసినట్లుగా అభిషేక్ తన పేరు వేసుకోవడం గమనార్హం.

WhatsApp channel
 

టాపిక్

 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *