Shruti Haasan Marriage: సలార్ బ్యూటీ శృతి హాసన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా.. ఇదీ ఆమె రియాక్షన్

Best Web Hosting Provider In India 2024

Shruti Haasan Marriage: సలార్ మూవీలో ఫిమేల్ లీడ్ గా నటించిన శృతి హాసన్ తన బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాను సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? శాంతను బాయ్‌ఫ్రెండ్ నుంచి భర్తగా ప్రమోషన్ అందుకున్నాడా? ఈ మధ్య సోషల్ మీడియా సెన్సేషన్ ఒర్హాన్ అవత్రమణి అలియాస్ ఒర్రీ.. శాంతనును శృతి భర్తగా చెప్పడం సంచలనం సృష్టించింది.

 

ట్రెండింగ్ వార్తలు

అతని కామెంట్స్ వైరల్ అవడంతో శృతి హాసన్ మంగళవారం (డిసెంబర్ 26) రాత్రి తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తాను పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేసింది. తన గురించి తెలియని వాళ్లు కాస్త నోరు మూసుకొని ఉంటే మంచిదని ఆమె అనడం విశేషం. “నేను పెళ్లి చేసుకోలేదు. ప్రతి విషయంలోనూ ఓపెన్ గా ఉండే నేను నా పెళ్లి విషయం ఎందుకు దాచి పెడతాను? అందువల్ల నా గురించి తెలియని వాళ్లు కాస్త నోరు మూసుకుంటే మంచిది” అని సోషల్ మీడియా ఎక్స్‌లో శృతి పోస్ట్ చేసింది.

శృతి వెర్సెస్ ఒర్రీ

ఒర్రీ అలియాస్ ఒర్హాన్ అవత్రమణి ఓ సోషల్ మీడియా సెన్సేషన్. సెలబ్రిటీలతో పార్టీలు చేసుకుంటూ వాళ్లతో ఫొటోలు దిగుతూ తాను కూడా ఓ సెలబ్రిటీ అయ్యాడు. సుహానా ఖాన్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లాంటి వాళ్లతో అతడు తరచూ ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఈ మధ్య అతడు తన ఫ్యాన్స్ తో మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి అడిగి ప్రశ్నకు ఒర్రీ స్పందించాడు.

అనవసరమైన ఆటిట్యూడ్ చూపించే సెలబ్రిటీ ఎవరు అని ఆ వ్యక్తి అడగ్గా.. శృతి హాసన్ అంటూ వెంటనే స్పందించాడు ఒర్రీ. ఆమె తనతో చాలా రూడ్‌గా వ్యవహరించిందని అతడు చెప్పాడు. తననో ప్యూన్ అని అన్నట్లు కూడా తెలిపాడు. అయితే శృతి హాసన్ భర్త శాంతను హజారికా మాత్రం తనకు మంచి ఫ్రెండ్ అని అతడు చెప్పడం విశేషం.

 

ఇక్కడ శాంతనును శృతి భర్త అంటూ చెప్పడంతో ఈ ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారన్న పుకార్లు మొదలయ్యాయి. రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవడంతో శృతి ఇలా స్పందించింది. ఆమె అభిమానులు కూడా ఈ విషయంలో శృతికి మద్దతుగా నిలిచారు. మరోవైపు సలార్ సక్సెస్ ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. మొదట ఈ సినిమా చేయడానికి తాను ఇష్టపడకపోయినా కేవలం ప్రభాస్ తో నటించాలన్న ఉద్దేశంతో ఓకే చెప్పినట్లు తెలిపింది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *