Krishna mukunda murari december 27th: దేవ్ ని అనుమానించిన మధుకర్.. మురారి, కృష్ణని చూసి అసూయపడుతున్న ముకుంద

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari december 27th: భవానీ మధుకర్ చెంప చెల్లుమనిపిస్తుంది. ఏమైంది మధు ఏం చేశాడని మురారి అడుగుతాడు. ఒక పనికిమాలిన పని చేశాడు అందుకే అలా అంటూ వెటకారంగా చెప్తుంది. కృష్ణ కాఫీ ఇస్తుంటే వద్దు అన్నట్టు రేవతి భవానీ వైపు చూపించి సైగ చేస్తుంది. చూశావా కృష్ణ వీళ్ళు నిన్ను పని మనిషిలాగా కూడా చూడటం లేదని చెప్తే వినలేదని మురారి తిడతాడు. శభాష్ మురారి కేసు తేలకముందే నువ్వు వేరు, మేము వేరు అన్నట్టు చేశావ్. ఇక కేసులు ఎందుకు పంచాయతీలు ఎందుకని అంటుంది. మురారి మాట్లాడబోతుంటే భవానీ వినిపించుకోదు.

 

ట్రెండింగ్ వార్తలు

కృష్ణని తిట్టిన భవానీ.. ధీటుగా బదులిచ్చిన మురారి

కేసు తేలే వరకు రావొద్దని నేను చాలా క్లియర్ గా చెప్పాను అయినా ఫలితం లేదని భవానీ అంటుంది. మీకు ముందే చెప్పాను కృష్ణ ఈ ఇంటికి రావచ్చు పోవచ్చని మురారి అంటాడు. ఎందుకు మురారి ఇలా నటించడం అలవాటు చేసుకుంటున్నావని ప్రశ్నిస్తుంది. ఆ మాటకి అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు. నటిస్తున్నానా అంటే అవును చెప్పాలంటే మమ్మల్ని చీట్ చేస్తున్నావ్. మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నావని తిడుతుంది. ఏమైనా ఉంటే నన్ను అనండి తప్పు చేశానని అంటున్నారు కాబట్టి నేను పడతాను. కానీ ఏసీపీ సర్ అని కృష్ణ మాట్లాడబోతుంటే నోర్ముయ్ ఏం మాట్లాడాలో నువ్వు డిసైడ్ చేస్తావా అని భవానీ అరుస్తుంది.

వచ్చే శుక్రవారం లోపు కేసు తేలకపోతే ముకుందని పెళ్లి చేసుకుంటానని అన్నాను ఇందులో ఏం మాట తప్పానని మురారి అడుగుతాడు. నువ్వు నిజంగా ప్రయత్నం చేస్తే కేసు ఎప్పుడే తేలిపోయేది. కానీ నీ టైమ్ అంతా అవుట్ హౌస్ లో గడుపుతుంటే ఇంకేముంటుందని అంటుంది. కృష్ణ పట్ల మీకు ఇంత అయిష్టం ఉందని అనుకోలేదని అంటాడు. గతం మర్చిపోయి మాట్లాడుతున్నావ్. వాళ్ళు చేసే పనులని బట్టి ఎవరి మీదైన ఇష్టం, అయిష్టం ఏర్పడుతుంది. అది నాకే కాదు అందరికీ అలాగే ఉంటుంది. కాఫీ పట్టుకు రమ్మని నీకు చెప్పలేదు కదా మా పరువు తీయడానికి తీసుకొచ్చావా అని ముకుంద అడుగుతుంది. కాఫీ పట్టుకొస్తే తప్పు ఏంటని కృష్ణ అంటే కేసు తేలే వరకు తీసుకురాకూడదు. అలా చేస్తే మమ్మల్ని మంచి చేసుకోవడానికని అర్థమని భవానీ ముకుందని వెనకేసుకొస్తుంది.

 

దేవ్ ని అనుమానించిన మధు

రెండు రోజుల్లో కేసుని తేలుస్తాను. నువ్వు ఇక ఇదే ఇంట్లో శాశ్వతంగా ఉంటావాని మురారి కృష్ణకి మాట ఇస్తాడు. మధుకర్, నందిని మురారి గురించి మాట్లాడుకుంటారు. మురారి గురించి కాదు వాడికి పట్టిన దురదృష్టం గురించి ఆలోచించాలి. బ్రో నిజంగా హీరో. మురారిలో వచ్చిన మార్పు నువ్వు గమనించావా? తను ఇప్పుడు ప్రశ్నించడం నేర్చుకున్నాడు. కృష్ణని వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నాడు. వాడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మధుకర్ అంటాడు. శుక్రవారం మురారితో పాటు కృష్ణ పెళ్లి పీటల మీద కూర్చుంటుందని మధుకర్ ధీమాగా చెప్తాడు. తనకి మాత్రం చాలా టెన్షన్ గా ఉందని నందిని అంటుంది.

దేవ్, ముకుంద మాట్లాడుకుంటూ ఉంటారు. మురారి స్పీడ్ చూస్తుంటే ఇవాళ రేపు నిజం బయట పెట్టేలా ఉన్నాడని ముకుంద టెన్సిన్ పడుతుంది. వాడి మొహం ఇలాంటి వాళ్ళు మాటలే కానీ చెట్లు ఉండవులే అని దేవ్ ధైర్యం చెప్తాడు. ఏమో నాకు అయితే కృష్ణ నిన్ను గమనిస్తుందని డౌట్ గా ఉంది. నావైపు అదోలా చూస్తుంది. అదే మురారికి కూడా అనిపిస్తే తన డౌట్స్ చెప్తుంటే దేవ్ అటువా మధుకర్ రావడం చూసి మాట మారుస్తాడు. ఈ దేవ్ ని ఎందుకో నమ్మాలని అనిపించడం లేదు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని అనిపిస్తుందని మధుకర్ మనసులో అనుకుంటాడు.

 

మురారిని పెళ్లి చేసుకోవడం అవసరమా…

ఏసీపీ సర్ తో వెళ్ళి కేసు సాల్వ్ చేయాలి. అప్పుడు మా బంధం శాశ్వతం అవుతుందని కృష్ణ అనుకుంటుంది. పెద్దమ్మ ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదని అనుకుంటాడు. కృష్ణ ఇంటి ముందు నిలబడిన మురారి తనని పిలుస్తాడు. వాళ్ళని ముకుంద, దేవ్ చూస్తూ ఉంటారు.

మురారి నిద్రలేచిన దగ్గర నుంచి కృష్ణ అని తన చుట్టూ తిరుగుతున్నాడు. నీ మొహం కూడ చూడటం లేదు. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావ్ ఒక్కసారి ఆలోచించమని దేవ్ ముకుందతో అంటాడు. నీ వల్ల కాదంటే వెళ్లిపో అంతేకాని ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడొద్దని తిడుతుంది. తనలో ఉన్న స్టైల్, తనపట్ల తనకున్న చిన్న నిర్లక్ష్యం అదే మురారి అంటుంది. నీది ప్రేమ, మైకమో, వ్యామోహమో అర్థం కావడం లేదని అంటుంటే ముకుంద చిరాకుపడుతుంది.

మురారి పిలిచేసరికి కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చి కాలు స్లిప్ అవుతుంది. తను పడబోతుంటే మురారి పట్టుకుంటాడు. వాళ్ళిద్దరినీ చూసి ముకుంద కుళ్ళుకుంటుంది. కృష్ణ నిలబడలేక కింద పడిపోతుంది. తను నడవలేకపోతున్నానని అనేసరికి మురారి ఎత్తుకుంటాడు. వాడు అలా కృష్ణని ఎత్తుకోవడం ఇదే లాస్ట్ అవుతుందిలే. నాకే వాళ్ళని చూస్తుంటే కాలుతుంది. నీకు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలనని దేవ్ నచ్చజెపుతాడు.

 

రేవతి కొడుకు గురించి బాధపడుతూ ఉండగా భవానీ వచ్చి ఏమైందని అంటుంది. మురారి తినకుండా వెళ్ళడం లేదని బాధపడుతుందని నందిని చెప్తుంది. నీ కొడుకు ఏం బ్రేక్ ఫాస్ట్ మానేయడులే అక్కడ ఇంద్రభవనం ఉంది కదా అక్కడికి వెళ్తాడులే అని భవానీ అంటుంది. లేదు మురారి కేసు పని మీద బయటకి వెళ్లాడని రేవతి చెప్తుంటే ఎదురుగా మురారి ఎదురుగా కృష్ణని ఎత్తుకుని వస్తూ ఉంటాడు.

తరువాయి భాగంలో..

మురారి పరిమళకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. ఆర్టిస్ట్ ని కూడా ఇంటికే రమ్మని చెప్తున్నట్టు మురారి చెప్పడంతో ముకుంద టెన్షన్ పడుతుంది. దేవ్ ని ఇంటికి రావొద్దని చెప్పాలని ఫోన్ చేయడం కోసం టెన్సిన్ గా పక్కకి వెళ్ళిపోవడం కృష్ణ గమనిస్తుంది. ఈ కేసు విషయం మాట్లాడితే ముకుంద ఎందుకో టెన్షన్ పడుతుందని కృష్ణ మనసులో అనుకుంటుంది. పరిమళ ఉన్న షాపులొకే దేవ్ వెళతాడు. తనని చూసి షాక్ అవుతాడు. పరిమళ కూడా తనని చూసిందా? మురారికి దేవ్ దొరికిపోతాడా లేదా తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *