Best Web Hosting Provider In India 2024

Aloo Pulao Recipe: బంగాళదుంపలతో ఉండే వంటకాలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కొందరు వీటిని ఆటూ అంటే, మరికొందరు బంగాళాదుంపలు అంటారు. వీటితో చేసే వంటకాలు పిల్లలకు తెగ నచ్చేస్తాయి. ఆలూ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ అంటే ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. అలాగే బంగాళదుంపలతో చేసే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఆలూ పులావ్ రెసిపీ సింపుల్‌గా ఇక్కడ ఇచ్చాము. ఎలాగో చూడండి. దీన్ని బేబీ పొటాటోలతో చేస్తే రుచిగా ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
ఆలూ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – ఒకటిన్నర కప్పు
బేబీ పొటాటో – ఎనిమిది
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు – అరకప్పు
కారం – ఒక స్పూను
ఉల్లిపాయ – ఒకటి
గరం మసాలా – ఒక స్పూను
పుదీనా తరుగు – పావు కప్పు
ధనియాల పొడి – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – రెండు
యాలకులు – రెండు
దాల్చిన చెక్క – ఒకటి
లవంగాలు – నాలుగు
బిర్యానీ ఆకు – ఒకటి
అనాస పువ్వు – ఒకటి
నెయ్యి – మూడు స్పూన్లు
నిమ్మరసం – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – పావు కప్పు
ఆలూ పులావ్ రెసిపీ
1. ఆలూ పులావ్ టేస్టీగా రావాలంటే బేబీ బంగాళాదుంపలను ఎంచుకోవాలి. ఇవి చిన్నవిగా ఉంటాయి కట్ చేయాల్సిన అవసరం లేదు.
2. బంగాళదుంపల పైన చెక్కును తీసి నీటిలో వేసి పెట్టాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి కలిపి పక్కన పెట్టాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి.
5. నెయ్యి వేడెక్కాక శుభ్రంగా కడిగిన బంగాళదుంపల్ని తీసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు అదే కళాయిలో బిర్యాని ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాసపువ్వు, ఉల్లిపాయలు తరుగు వేసి వేపుకోవాలి.
7. అవి బంగారు రంగులోకి వేగాక అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చిని వేయాలి.
8. ఇప్పుడు పెరుగులో కలుపుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
9. తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగును కూడా వేసి కలుపుకోవాలి.
10. అవి బాగా కలిసాక ముందుగా వేయించిన ఆలుగడ్డలను వేసి కలపాలి.
11. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి తగినన్ని నీళ్ళను పోయాలి.
12. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. చివర్లో నిమ్మరసాన్ని కలుపుకోవాలి.
13. మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత తీస్తే వేడి వేడి ఆలూ పులావ్ సిద్ధమైపోతుంది.
14. దీన్ని ఎలాంటి సైడ్ డిష్ లేకుండా తినవచ్చు. లేదంటే రైతా కలుపుకొని తిన్నా రుచిగానే ఉంటుంది. ఇది దమ్ బిర్యానీ కి పోటీ ఇచ్చేలా ఉంటుంది.
టాపిక్