Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu December 27th Episode: వసుధారతో పాటు రిషిని చంపేందుకు భద్ర అనే రౌడీతో డీల్ కుదుర్చుకుంటాడు శైలేంద్ర. వసుధార, మహేంద్రలకు నమ్మకస్తుడిగా మారి ఆ తర్వాత తన ప్లాన్‌ను అమలు చేస్తానని శైలేంద్రతో అంటాడు భద్ర. రిషి కనిపించకుండాపోవడంతో వసుధార, మహేంద్ర తన కొడుకు శైలేంద్రను అనుమానించడం ఫణీంద్ర తట్టుకోలేకపోతాడు. నీపై పడిన నింద పోవాలంటే నువ్వే రిషిని వెతికి మహేంద్ర, వసుధారలకు అప్పగించాలని కొడుకుతో అంటాడు ఫణీంద్ర.
ట్రెండింగ్ వార్తలు
మహేంద్ర సెటైర్…
శైలేంద్రను తీసుకొని వసుధార, మహేంద్ర ఇంటికి వస్తాడు ఫణీంద్ర. వద్దు అంటోన్న తండ్రి తనను మహేంద్ర ఇంటికి తీసుకురావడంతో శైలేంద్ర కంగారు పడతారు. రిషి మిస్సింగ్‌పై కొన్ని క్లూలు దొరికాయని, త్వరలోనే అసలైన దోషిని పట్టుకుంటానని ముకుల్ తనతో చెప్పాడని శైలేంద్రను చూస్తూ ఫణీంద్రతో అంటాడు మహేంద్ర. శైలేంద్ర కూడా రిషిని వెతికే పనిలోనే ఉన్నాడని ఫణీంద్ర అంటాడు.
శైలేంద్ర అయితేనే ఖచ్చితంగా రిషిని వెతికి తీసుకురాగలడు. ఒకవేళ తీసుకురాకపోతే అతడు ఉండడు కదా అంటూ శైలేంద్రపై మహేంద్ర సెటైర్ వేస్తాడు. రిషి మిస్సింగ్ విషయంలో శైలేంద్రను అనుమానిస్తున్నావా అని మహేంద్రను అడుగుతాడు ఫణీంద్ర.
అనుమానం లేకుండా గన్ తీసుకొచ్చి శైలేంద్రను ఎందుకు షూట్ చేయబోయావు. నిజంగానే శైలేంద్రనే ఈ తప్పు చేశాడని తెలిస్తే నేను వాడిని షూట్ చేసి చంపేస్తానని మహేంద్రతో అంటాడు ఫణీంద్ర. తండ్రి మాటలు విని శైలేంద్ర షాకవుతాడు.
అనుపమ ఆన్సర్…
అప్పుడు జగతి, ఇప్పుడు రిషి విషయంలో శైలేంద్రపై అనుమానం రావడానికి కారణం ఏమిటో ఎన్నిసార్లు అడిగిన మీరు చెప్పడం లేదని వసుధార, మహేంద్రతో అంటాడు ఫణీంద్ర. అన్నయ్యకు సమాధానం చెప్పకుండా మహేంద్ర మౌనంగా ఉండిపోతాడు. చట్ట ప్రకారమే అసలైన దోషులను పట్టుకోవాలని అనుకుంటున్నట్లు అనుపమ, వసుధార అంటారు.
ఇందాకే ఇంటికి వచ్చామని, కానీ మీరు ఎవరూ లేరని, ఎక్కడికి వెళ్లారని మహేంద్రను అడుగుతాడు ఫణీంద్ర. డెడ్ బాడీ ఐడెంటీఫై కోసం హాస్పిటల్ వెళ్లిన విషయం మహేంద్ర చెప్పకుండా దాచిపెడతాడు. వారి నోటి ద్వారా ఆ విషయాన్ని బయటపెట్టించాలని శైలేంద్ర ప్రయత్నిస్తాడు. కానీ అనుపమ జోక్యం చేసుకొని టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
దేవయాని కంగారు…
రిషిని శైలేంద్ర కిడ్నాప్ చేసినట్లు వసుధార దగ్గర ఆధారాలు ఉన్నాయనే నిజం తెలిసినప్పటి నుంచి దేవయాని కంగారు పడుతుంటుంది. తన కొడుకు ఎక్కడ దొరికిపోతాడో అని భయపడుతుంది. తల్లికి ధైర్యం చెబుతాడు శైలేంద్ర. భయం అన్నది తన హిస్టరీలోనే లేదని చెబుతాడు. వసుధార ఇచ్చిన వార్నింగ్‌ను శైలేంద్రకు గుర్తుచేస్తుంది దేవయాని. అసలు ఉన్నాడో లేడో తెలియని రిషిని ఎక్కడి నుంచి తీసుకొస్తావని కొడుకును అడుగుతుంది దేవయాని.
నన్ను ఇరికించాలని ప్రయత్నించిన వాళ్లు ఫెయిలయ్యారు. దెబ్బకొట్టాలని చూసిన వాళ్లు భూమి మీదనే లేకుండా పోయారని పొగరుగా శైలేంద్ర సమాధానమిస్తాడు. తాను భయపడుతుంది వసుధార గురించి కాదని ఫణీంద్ర గురించి అని శైలేంద్రతో అంటుంది దేవయాని. మన నిజస్వరూపం అయనకు తెలిస్తే తండ్రి ఉగ్రరూపం చూడాల్సివస్తుందని కొడుకును భయపెడుతుంది దేవయాని. రిషిని తిరిగిరాకపోతే ఆయన ఊరుకోడని అంటుంది.
కథ అంత వరకు రానివ్వనని కూల్‌గా తల్లికి సమాధానమిస్తాడు శైలేంద్ర. తన ప్లాన్ ఏమిటో చెప్పనని చూస్తూ ఉండమని దేవయానికి బదులిస్తాడు శైలేంద్ర. నువ్వు కోరుకున్నట్లుగానే నీ కొడుకు డీబీఎస్‌టీ కాలేజీకి రాజు అవుతాడని అంటాడు. శైలేంద్ర ప్లాన్ ఏమిటో తెలియక దేవయాని కంగారు పడుతుంది.
భద్ర ప్లాన్…
వసుధార ఫ్యామిలీకి దగ్గరై ఆమెను చంపాలనే ప్లాన్‌ను అమలు చేయడం మొదలుపెడతాడు భద్ర. అందులో భాగంగా ముందుగా మహేంద్రను మంచివాడిగా నమ్మించాలని ఫిక్స్ అవుతాడు. ఓ ప్లాన్ వేసి అతడి కారుకు అడ్డం వెళతాడు. తాను అనాథనని, పని కోసం వెతుకుతున్నానని చెప్పి మహేంద్రను మాటలతో బోల్తా కొట్టిస్తాడు.
మహేంద్ర దగ్గర కారు డ్రైవర్‌గా పనిలో చేరుతాడు. నువ్వు మాతో పాటే మా ఇంట్లోనే ఉండాలని భద్రతో అంటాడు మహేంద్ర. భద్ర యాక్టింగ్‌ను చాటు నుంచి చూస్తాడు శైలేంద్ర. అతడి ప్లాన్ చూసి ఖచ్చితంగా వసుధార, రిషిలను అతడు చంపగలడని నమ్ముతాడు. తన కల నెరవేరబోతుందని ఆనందపడతాడు.
శైలేంద్ర నిజస్వరూపం…
ఊసరవెల్లిలా శైలేంద్ర రంగులు మారుస్తూ ఉంటే అతడిని ఏం చేయలేకపోతున్నామని బాధపడుతుంది వసుధార. ఎన్ని దారుణాలు చేసిన ఏ మాత్రం భయలేకుండా నటిస్తున్నాడని అనుపమతో అంటుంది. రిషి తిరిగి వచ్చే వరకే శైలేంద్ర ఆటలు సాగుతాయనిన అనుపమ బదులిస్తుంది. అతి తొందరలోనే శైలేంద్ర నిజస్వరూపం బట్టబయలు చేస్తానని ఆవేశంగా అనుపమతో అంటుంది వసుధార.
భద్ర ఎంట్రీ…
అప్పుడే భద్రను తీసుకొని మహేంద్ర ఇంట్లోకి వస్తాడు. ఇకమీదట భద్ర కూడా మనతో పాటే ఉంటాడని మహేంద్ర అంటాడు. ఇకపై అనుపమ, వసుధారలకు కాపాడే బాధ్యత నీదేనని భద్రతో అంటాడు మహేంద్ర. ఆ తర్వాత శైలేంద్రకు ఫోన్ చేసిన భద్ర…పనిలో చేరానని త్వరలోనే గుడ్‌న్యూస్ వినిపిస్తానని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర…భద్ర మాటలు వింటాడు.
ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతాడు. తన స్నేహితుడితో మాట్లాడుతున్నానని, భద్ర అబద్ధం ఆడుతాడు. నమ్మకం లేని చోట తాను ఒక్క క్షణం కూడా ఉండనని భద్ర రివర్స్ డ్రామా ప్లే చేసి శైలేంద్రను బోల్తా కొట్టిస్తాడు. భద్రకు తమ ఇంట్లోనే షెల్టర్ కూడా ఇవ్వాలని అనుపమ, మహేంద్ర అనుకుంటారు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.