YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.02-10-2022(ఆదివారం) ..
గాంధీజీని అనుసరించడమే ఆయనకు ఘనమైన నివాళి ..
మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ..
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ,ముందుగా స్థానిక పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి , గాంధీ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం ,సుపరిపాలన అందించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు , పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని , అన్ని వర్గాల అభివృద్ధే -దేశాభివృద్ధి అని మహాత్ముడు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పల్లె లను అభివృద్ధి చేస్తూ – అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు , ముఖ్యంగా గ్రామాల అభివృద్ధిలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థ -భవనాలు , రైతు భరోసా కేంద్రం భవనాలు , విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు , ఇంటింటికి కుళాయి పథకం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ,
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించారని , ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సైతం అదే బాటలో నడుచుకుంటూ ప్రజారంజక పాలన అందిస్తున్నారని తెలిపారు , గాంధీ చూపిన మార్గంలో నేటి యువత పయనించాలని సూచించారు , ఆయన మార్గాలను అనుసరించడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : పట్టణంలోని 5 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”…
Follow us : Facebook ,Twitter ,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka