
ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు మండలం :
ది.05-10-2022(బుధవారం) ..
ఏటూరు గ్రామంలో మునేటి లో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వ నుండి మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేత ..
చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో జనవరి నెలలో ప్రమాదవశాత్తు మునేటి లో పడి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అందజేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు కలిగిన చిన్నారి విద్యార్థులు ప్రమాదవశాత్తు మునేటిలో పడి మృతి చెందటం కలిచివేసిందని , వారి కుటుంబాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగిందన్నారు , మృతి చెందిన చిన్నారులు కర్ల బాబు , మైలా రాకేష్ , జట్టి అజయ్ ,మొగులూరు సన్నీ , గురుజాల చరణ్ ల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు ,ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరఫున చెరువుల వద్ద రక్షణ చర్యల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగిందని తెలిపారు ,
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేల్పుల ఏసమ్మ , జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , పెరమసాని నరసింహారావు , రామయ్య , దశరథ్ రామ్ తదితరులు పాల్గొన్నారు ..