
Best Web Hosting Provider In India 2024

పురుషులు అబద్ధాలు చెబుతున్నారని మహిళలు ఈజీగా గుర్తుపట్టేస్తారు. అయినా భాగస్వామిని నమ్మించేందుకు మగాళ్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. పదే పదే అబద్ధాలు చెప్పి తాను చెప్పింది నిజమని నమ్మించకూడదు. ఒకవేళ నిజం తెలిస్తే.. ఆ వ్యక్తిపై నమ్మకం పోయి వైవాహిక జీవితం నాశనం అవుతుంది. పెళ్లికి ముందు కూడా అబ్బాయికి, అమ్మాయికి చెప్పే చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆమె మనసుపై పెను ప్రభావం చూపుతాయి. ఇలా అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటే మళ్లీ నిజం చెప్పినా ఎవరూ ఒప్పుకోరు.
ట్రెండింగ్ వార్తలు
కొన్ని విషయాల్లో మగవాళ్ళు ఆడవాళ్ళకి నిజం చెప్పరు. పురుషులు చెప్పే అత్యంత సాధారణ అబద్ధాలు, స్త్రీలు ఎప్పటికీ అంగీకరించని విషయాలు ఏంటో చూడండి.
భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత, అతను ఇంటికి వచ్చే వరకు భార్య వేచి ఉంటుంది. సాయంత్రం బయటకు వెళ్దాం అని చాలా సార్లు చెప్పిన భర్త తొందరగా ఇంటికి రాడు. భార్య ఎదురు చూస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్ చేసి ఎందుకు ఆలస్యం అని భార్య అడిగితే భర్త చెప్పే అతి ముఖ్యమైన అబద్ధం.. నేను ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయానని. సాధారణంగా మీరు ప్రతిరోజూ ఒకే రహదారిపై డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు మీ భార్యను అదే రూటులో కూడా తీసుకుని వెళ్లి ఉంటారు. ట్రాఫిక్ ఉన్నా ఎంత టైమ్ పడుతుందో మీ భాగస్వామికి తెలిసి ఉంటుంది. అందుకే అబద్ధం చెప్పకూడదు. భార్య దీనిని అంగీకరించదు.
నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెబుతుంటారు కొందరు భర్తలు. భార్యను ఒప్పించడానికి లేదా సంతోషపెట్టడానికి ఈ అబద్ధం చెప్పడం కొంత వరకు మంచిది. అయితే ఇది అక్షరాలా అబద్ధమని భార్యకు తెలిస్తే వివాహ బంధంలో ఇబ్బందులు వస్తాయి. భార్య కాకుండా తల్లిని, అక్కను ప్రేమించే చాలా మంది ఉన్నారు. కానీ భార్యను సంతోషపెట్టడానికి నువ్వే నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని చెప్పడం అబద్ధం. ఇది ఆమెకు తెలిస్తే నరకం.
ఏదైనా పని చేసే విషయంలో మగవాళ్లు వాయిదా వేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో మగవాళ్లు రేపు చేద్దామని అంటారు. రేపు తప్పకుండా చేస్తాను అంటాడు. ప్రతిసారీ పనిని వాయిదా వేస్తూ ఉంటే మంచిది కాదు. మీ వాగ్దానానికి విలువ ఉండదు. ఏదైనా విషయంలో రేపు చేస్తానని భర్త చెబితే.. భార్య అతనిని ఎప్పటికీ నమ్మదు.
పెళ్లయ్యాక మగవాళ్ళకి ఫ్రెండ్స్ తో కలిసి బయటకి వెళ్లి పార్టీలు చేసుకోవడం అలవాటు. కానీ తన భార్యకు ఇది ఇష్టం లేదని బాగా తెలుసు. నేను ఎక్కువగా తాగను అని ప్రతిసారీ అబద్ధాలు చెప్పడం మామూలే. స్నేహితులతో కలిసిపోతారు. తన భార్యకు తెలియకుండా తన స్నేహితులతో చాలా పార్టీలు చేస్కుంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రమే డ్రింక్ చేస్తానని మాత్రమే అబద్ధం చెబుతాడు. కానీ చాలాసార్లు డ్రింక్ చేసి వస్తారు. ఇది భార్యకు నచ్చదు.
చాలా సార్లు భార్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా భర్త కాల్ రిసీవ్ చేసుకోడు. భార్య పిలుపుని కూడా పట్టించుకోక పోవడం చేస్తుంటారు. స్నేహితులతో ఉన్నప్పుడు ఆమె కాల్‌ను పట్టించుకోరు. నేను కాల్ చూడలేదని, ఫోన్ సైలెంట్‌లో ఉందని అబద్ధాలు చెబుతారు. ఇది కూడా ఏ స్త్రీ అంగీకరించదు. చిన్న అబద్ధం కూడా భార్య మనసుపై పెద్ద ప్రభావం చూపుతుందని పురుషులు గుర్తుంచుకోవాలి. ఆనందాన్ని ఇచ్చేందుకు కొన్ని అబద్ధాలు చెప్పాలి. కానీ ప్రతితీ అబద్ధం అవ్వకూడదు. అది కచ్చితంగా మీ బంధానికి మంచిది కాదు.