
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.17-10-2022(సోమవారం) ..
సంక్షేమ పాలన పై ప్రజల్లో హర్షాతిరేకాలు ..
మునగచర్ల గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని మునగచర్ల గ్రామంలో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ,వాలంటీర్లు ప్రభుత్వ పాలనకు మూలస్తంభాలన్నారు , ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న సంక్షేమ -అభివృద్ధి పాలనతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు , గ్రామంలోని ఇంటింటికి ఆయన వెళ్లి గత మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు , స్థానికుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు , పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ,అర్హులందరికీ సంక్షేమ ఫలాలను అందించటమే సీఎం జగన్ లక్ష్యమన్నారు , రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి కి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబు- ఆ పార్టీ నాయకులు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు , ప్రతిపక్షాల అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు ..
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నరసింహారావు ,గ్రామ కన్వీనర్ భద్రయ్య ,వైస్ ఎంపీపీ ఆకుల రంగా (హనుమంతరావు) ,మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు , జిల్లపల్లి రంగారావు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు -వాలంటీర్లు పాల్గొన్నారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka