Leo TV Premiere: టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్‌ కానున్న లియో.. డేట్, టైమ్ ఫిక్స్

Best Web Hosting Provider In India 2024

Leo TV Premiere: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లియో సినిమా బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. గతేడాది అక్టోబర్‌లో భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అంచనాలను నిలబెట్టుకుంటూ మంచి విజయం సాధించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాకు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. తెలుగులోనూ లియో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు లియో తెలుగు వెర్షన్ మూవీ టెలివిజన్‍(టీవీ)లోకి వచ్చేందుకు రెడీ అయింది.

 

ట్రెండింగ్ వార్తలు

సంక్రాంతి సందర్భంగా లియో తెలుగు సినిమా టెలివిజన్‍లో ప్రసారం కానుంది. జనవరి 15వ తేదీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి ఈ మూవీ జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని జెమినీ వెల్లడించింది.

లియో చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‍గా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, జార్జ్ మరియన్, మిస్కిన్, మడోనా సెబాస్టియన్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు.

లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగానే లియోను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించారు. లోకేశ్ గత చిత్రాలు ఖేదీ, విక్రమ్‍లకు లియోకు లింక్ ఉంది. లియోను కూడా తన మార్క్ యాక్షన్ మూవీగా లోకేశ్ రూపొందించారు. ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తిగా లియోను తెరకెక్కించారు.

లియో సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.595 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం రూ.45కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

లియో సినిమా ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. గత నవంబర్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

 

ఇదీ లియో కథ

హిమాచల్ ప్రదేశ్‍లో పార్థిబన్ (దళపతి విజయ్).. ఓ కేఫ్ నడుపుతుంటారు. తన భార్య సత్య (త్రిష)తో కలిసి కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తుంటారు. అయితే, ఓ దశలో కేఫ్‍లో గొడవ జరగడంతో కొందరు గ్యాంగ్‍స్టర్లను పార్థిబన్ చంపేస్తాడు. దీంతో కుటుంబానికి ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, పార్థిబనే తమ లియో అంటూ ఆంటోనీ దాస్ (సంజయ్ దత్), హరోల్డ్ దాస్ (అర్జున్) నమ్ముతారు. తాను లియో అని అంగీకరించాలని పార్థిబన్‍పై ఒత్తిడి చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? లియో ఎవరు? ఈ చిక్కుల నుంచి పార్థిబన్, అతడి కుటుంబం బయటపడిందా అనేదే లియో సినిమా కథగా ఉంది.

దళపతి విజయ్ తదుపరి.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి విజయ్ లుక్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ చేస్తున్నారు విజయ్.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024