సామాజిక సాధికార సంస్కర్త సీఎం వైయ‌స్‌ జగన్ 

Best Web Hosting Provider In India 2024

పేదలంటే ప్రాణమిచ్చే జగనన్న గొప్ప ప్రజానాయకుడు: ఎంపీ తలారి రంగయ్య

పేద బతుకుల్లో వెలుగు జగనన్న..పేదల పిల్లల వెలుగు జగనన్న: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

జగనన్నకు ప్రజాభిమానమే పెట్టని కోట: మాజీ మంత్రి శంకరనారాయణ

సంక్షేమ పథకాలతో బడుగు,బలహీన వర్గాల్లో వెలుగులు:  మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి 

 ఉరవకొండ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర 

అనంత‌పురం జిల్లా: ఉరవకొండ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. సాయంత్రం జరిగిన బహిరంగసభకు వేలాదిగా జనం తరలివచ్చారు. మాజీఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయనతో పాటు ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీమంత్రి శంకరనారాయణ, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ గిరిజమ్మ ప్రసంగించారు. సభ పూర్తయ్యే వరకు ప్రేక్షకులు ఉత్సాహంగా ఉండటం…జై జగనన్న నినాదాలతో సభాస్థలిని హోరెత్తించడం విశేషం.

ఎంపీ తలారి రంగయ్య
– జగనన్నకు అధికారం ఇచ్చాం కాబట్టే మనకు సామాజిక సాధికారత వచ్చింది
–  ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు పదవులు వచ్చాయి
– సామాజిక న్యాయమంటే ఏమిటో చేసి చూపించారు జగనన్న
– చేనేతలకు సంవత్సరానికి రూ.24వేలు ఇస్తున్న జగనన్న చేనేతలకు పెద్దన్న
– ఎలాంటి వివక్ష, అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారులుకు అందచేస్తున్నా జగనన్న

మాజీమంత్రి శంకరనారాయణ
–2019లో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే సామాజిక సాధికారత వెలుగులు మన జీవితాల్లో నిండాయి.
– ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాలను వెన్నెముక కులాలుగా, బలహీనవర్గాలను బలవంతులుగా మార్చడమే తన నినాదంగా జగనన్న ముందడుగులు వేస్తున్నారు.
– ఈరోజు పార్లమెంటు నుంచి జిల్లా స్థాయివరకు అనేక పదవుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల నాయకులను నిలిపారు సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి.

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌
– సామాజిక సాధికారత నినాదాలతో ఉరవకొండ దద్దరిల్లిపోవడం చాలా సంతోషంగా ఉంది.
– జగనన్న మీద జనం ప్రేమాభిమానాలు ఎంతగా ఉన్నాయో అర్థమవుతోంది
– జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రచరిత్రలో ప్రజలకు ఎంత మంచి జరిగిందో అర్థమవుతుంది. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చిన జగనన్న మాటతప్పని నాయకుడు. 
– చంద్రబాబు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలో ఉన్నప్పుడు నెరవేర్చలేదు. మళ్లీ ఇప్పుడు కొత్త హామీలతో జనం ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మళ్లీ మనం చంద్రబాబును నమ్మితే, నట్టేట మునగడమే.
– చంద్రబాబు హయాంలో చదువుల పేరిట, ఆరోగ్యం పేరిట పేదలు అప్పుల పాలయ్యారు.
– జగనన్న పాలనలో అందరూ సుభిక్షంగా ఉన్నారు. పిల్లల చదువు భారం తల్లిదండ్రుల మీద లేదిప్పుడు. చదివే పిల్లలకు ఎంత పెద్ద చదువులైనా చేయిస్తానని జగనన్న చెబుతున్నాడు. ఆ మేరకు పథకాలు తెచ్చారు.. 
– అనారోగ్యం పాలయినప్పుడు గతంలో దిక్కుతోచని పరిస్థితి ఉండేది. అప్పులు చేయక తప్పని పరిస్థితి. అది కాకపోతే ..ప్రాణాలమీద ఆశ వదులుకోవాల్సిందే 
ఈరోజు వైద్యానికి పోతే అప్పుల పాలయ్యే పరిస్థితి పోయింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25లక్షల మేరకు వైద్యసేవలు అందేలా చేశారు జగనన్న.  
– రాష్ట్రంలో సంక్షేమం, అభివద్ధి కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తున్నారు. వర్తమానంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండటమే కాకుండా, వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలని… జగనన్న ఎంతో ముందు చూపుతో కార్యక్రమాలు చేస్తున్నారు. 

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
–ఈ నాలుగున్నరేళ్లలో జగనన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలతో పాటు, అగ్రవర్ణాల పేదల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. సామాజిక సాధికారతతో రాష్ట్రరాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.
– నలుగురు డిప్యూటీ సీఎంలను ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల నుంచే తీసుకున్నారంటే..అణచివేయబడ్డ వర్గాల పట్ల జగనన్నకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.
– మన పేదల, బడుగు,బలహీనవర్గాల ప్రజలకు ఆత్మగౌరవం అందించారు జగనన్న. వారి స్థాయిని పెంచారు. ఆర్థికస్థాయిని పెంచారు.
– రేపటి ఎన్నికలు పేదలకు, పెత్తందారుల మధ్య జరుగుతాయి. జగనన్న పేదల పక్షం. మన పక్షం. ఆయనను మళ్లీ గెలిపించుకోవడం మన బాధ్యత.

Best Web Hosting Provider In India 2024