Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 8th Episode: కళ్యాణ్ ఆలోచనలతో రోడ్‌పై పరధ్యానంగా నడుస్తోంటుంది అప్పు. కావ్య వెళ్తున్న ఆటోకు అడ్డంగా వస్తుంది. అది చూసి కావ్య…అప్పును తీసుకొని ఇంటికి వస్తుంది. కూతురు ఇంటికి రావడం చూసి కృష్ణమూర్తి ఫైర్ అవుతాడు. మా ఇంటికి ఎందుకొచ్చావని కావ్యను అడుగుతాడు. ఆ ప్రశ్న విని…కనకం, కావ్య షాకవుతారు. దుగ్గిరాల ఇంటి కోడలు ఈ సాధారణ మధ్య తరగతి ఇంటికి రావాల్సిన అవసరం ఏమిటో…కలవాల్సిన అవసరం ఏమిటో తెలియడం లేదని అంటాడు.
ట్రెండింగ్ వార్తలు
కనకం అత్యాశతో…
ఆశపడి అప్పు, అత్యాశపడి కనకం..మళ్లీ మీ ఇంట్లో ఓ కుంపటి రాజేసి వచ్చారు. నిప్పుతో కడిగిన వంశం దుగ్గిరాల వంశం. ఈ బూడిద రాశుల్లో ఏముందని ఈ గడపలో కాలుపెట్టావని కావ్యను నిలదీస్తాడు కృష్ణమూర్తి. ఇది నా పుట్టిళ్లు. జీవితాంతం నాకు ఇక్కడికి వచ్చే హక్కు ఉందని తండ్రికి బదులిస్తుంది కావ్య.
ఆ ఇంటి నుంచి ఇక్కడికి రాకపోకల కోసం వేసిన వారధి కూలిపోయిందని కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తాడు. పుట్టింటి నుంచి నువ్వు ఏం తీసుకెళ్లకపోయినా..పుట్టెడు దుఃఖం మాత్రం మూటగట్టిపంపిస్తున్నాం. ఈ ఆనవాయితీ ఇక ముందు కూడా కొనసాగితే నీ కాపురం సజావుగా జరగదని ఎమోషనల్ అవుతాడు కృష్ణమూర్తి.
పుట్టింటికి రావోద్దన్న కృష్ణమూర్తి…
కన్నబిడ్డ ఇంటికి రాకూడదని ఏ కన్న తండ్రి అనడం నేను చూడలేదని కృష్ణమూర్తికి సర్ధిచెప్పబోతోంది కనకం. నువ్వు భర్త చాటు భార్యగా గడప లోపలే ఉంటే కలో గంజో తాగి మన బతుకులు మనం బతికేవాళ్లం. నువ్వు అందరానిదాని కోసం అర్రులు చాచి పరిస్థితి ఇక్కడికి తీసుకొచ్చావని కనకానికి క్లాస్ ఇస్తాడు. తల్లీకూతుళ్లు కలిసి అప్పును దుగ్గిరాల ఇంటి కోడలిని చేయాలని అనుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇందులో నీ తప్పు లేకపోయినా నిన్ను దోషిని చేశారని కృష్ణమూర్తి బాధపడతాడు.
పుట్టుకతో వచ్చిన హక్కు…
అత్తగారితో పాటు చిన్నత్త దృష్టిలో నువ్వు దోషిగానే మిగిలిపోయావు. అందుకే నిన్ను ఇంటికి రావద్దొని అంటున్నానని కావ్యతో అంటాడు కృష్ణమూర్తి. కన్నవాళ్లకు పుట్టింటికి దూరంగా బతకడం నా వల్ల కాదని తండ్రికి సర్ధిచెప్పాలని చూస్తుంది కావ్య. అత్తగారిల్లు నా అర్హత. పుట్టిల్లు పుట్టుకతో నాకు వచ్చిన హక్కు అని కావ్య అంటుంది. కానీ అప్పు కూడా తండ్రి మాటలనే సమర్థిస్తుంది. నువ్వు ఇక్కడికి రాకపోవడమే మంచిది. మమ్మల్ని కలవకపోవడమే మంచిదని చెబుతుంది.
నన్ను ఆపే హక్కు లేదు..
ఏదైనా తప్పు జరిగి ఉంటే అది నా వల్లే జరిగింది. జీవితాంతం నేను దుగ్గిరాల ఇంటికి వెళ్లను. కావ్యను పుట్టింటికి రావద్దని అంటే జీవితాంతం అది అత్తింట్లో జైలులో మగ్గిపోయినట్లే మగ్గిపోవాలా కృష్ణమూర్తి, అప్పులపై ఫైర్ అవుతుంది కనకం. పుట్టింటికి రాకుండా నన్ను ఆపే హక్కు ఎవరికి లేదు. మీరు వద్దన్నా వస్తూనే ఉంటాను. పుట్టింటికి రాకుండా నన్ను ఆపే హక్కు అత్తింటి వాళ్లకే కాదు మీకు కూడా లేదని కోపంగా తల్లిదండ్రులతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య. కనకం వారిస్తున్నా వినదు.
అపర్ణ ఫైర్…
కళ్యాణ్, అనామిక చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడానికి దుగ్గిరాల ఫ్యామిలీ ఏర్పాట్లు చేయిస్తారు. పంతులు ముహూర్తం పెట్టివెళ్లిపోతాడు. ఉదయం రాజ్‌కు టిఫిన్ తీసుకొని వెళ్లిన కావ్య ఆలస్యంగా ఇంటికి రావడం చూసి అపర్ణ ఫైర్ అవుతుంది. ఎక్కడికి వెళ్లావని నిలదీస్తుంది. దారిలో అప్పు కనిపిస్తే పుట్టింటికి వెళ్లానని అంటుంది. ఎంత ధైర్యం ఉంటే వద్దని చెప్పిన తర్వాత ఆ ఇంటికి వెళతావు. అప్పుతో మాట్లొడొద్దని అంటున్నా ఎందుకు మాట్లాడావు అని కావ్యపై ధాన్యలక్ష్మి కోప్పుడుతుంది.
అప్పు నా చెల్లెలు అని ధాన్యలక్ష్మికి బదులిస్తుంది కావ్య. నా కొడుకు మోసం చేయాలని అనుకున్న మనిషి అంటూ ధాన్యలక్ష్మి ఆవేశంగా అంటుంది అప్పుకు కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు.అప్పు మంచిదని అంటాడు. తనను మోసం చేయాలని అనుకోలేదని చెబుతాడు. ఆ ఇంటితో సంబంధం పెట్టుకోవద్దని చెప్పిన తర్వాత ఎందుకు వెళ్లావు ఎందుకు మాట్లాడావు అంటూ కావ్యకు క్లాస్ ఇస్తుంది ధాన్యలక్ష్మి. అపర్ణ కూడా ధాన్యలక్ష్మికి సపోర్ట్ చేస్తుంది.
పుట్టింటికి వెళ్లడం నేను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. శత్రుదేశానికి వెళ్లినట్లు చూస్తున్నారని కావ్య బదులిస్తుంది. పెద్దవాళ్లు మాట్లాడితే వాళ్లకు ఎదురుచెప్పొచ్చా గొడవను పెద్దది చేస్తుంది అనామిక.
రుద్రాణి అవమానం…
ముందు నువ్వు దుగ్గిరాల ఇంటి కోడలివి అయ్యావు. ఆ తర్వాత ప్లాన్ చేసి స్వప్నను ఇంటి కోడలిని చేశాడు. ఆ తర్వాత అప్పును కోడలిగా తీసుకురావాలని అనుకున్నావు. కానీ ప్లాన్ వర్కవుట్ కాలేదు. అందుకే మీ వాళ్లు బాధలో ఉండి ఉంటారు. వాళ్లను ఓదార్చడానికి వెళ్లావు కదా అంటూ కావ్యను అవమానిస్తుంది రుద్రాణి.
నీ బుద్ది, నీ స్వప్న బుద్ది తెలుసుకోలేమా…మీ ఫ్యామిలీ మొత్తం ఇంతే అని నానా మాటలు అంటుంది. అపర్ణ, ధాన్యలక్ష్మి కూడా రుద్రాణి మాటలు సమర్థిస్తారు. స్వప్న సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. నన్ను మధ్యలోకి ఎందుకు లాగుతున్నారని రుద్రాణిని అడుగుతుంది. నువ్వు కూడా ఈ కుట్రలో భాగమేనని రుద్రాణి బదులిస్తుంది.
శివంగిగా మారిన స్వప్న…
ఏదో పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు. నిజం చెప్పాలంటే తప్పు చేసింది మీరు. గొడవలు చేసింది మీరు అంటూ రుద్రాణికి ధీటుగా బదులిస్తుంది స్వప్న. శివంగిలా రెచ్చిపోతుంది. మా అమ్మతో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు స్వప్నకు వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటాడు రాహుల్. కానీ అతడి మాటల్ని స్వప్న పట్టించుకోదు. అసలు మోసానికి ప్రతిరూపాలు నువ్వు మీ అమ్మ అంటూ రాహుల్‌పై ఫైర్ అవుతుంది.
నిజంగా కావ్య తలచుకుంటే…
నేను, కావ్య కలిసి మోసం అందరూ అంటున్నారు. ఒకవేళ నిజంగా మోసం చేయాలని అనుకుంటే ఒక్కరూ కూడా ఈ పెళ్లిని ఆపలేకపోయేవారు. కావ్య మాటలకు కళ్యాణ్ ఎంత విలువ ఇస్తాడో మీ అందరికి తెలుసు. నిజంగా కళ్యాణ్, అప్పులను ఒక్కటి చేయాలని కావ్య అనుకుంటే అనామికను తప్పించి వాళ్ల పెళ్లి జరిపించడం కావ్యకు ఎంతో సేపు పట్టదని స్వప్న అంటుంది.
కళ్యాణ్ తనకు ఎంతో విలువ ఇస్తాడు…కావ్య కూడా కళ్యాణ్ ఇష్టానికి, ప్రేమకు అంతే విలువ ఇచ్చింది. అతడి ప్రేమ గెలవాలని ఇంట్లో అందరిని ఒప్పించి పెళ్లి వరకు తీసుకెళ్లింది. కళ్యాణ్ పెళ్లిని చెడగొట్టాలనే ఉద్దేశం కావ్యకు ఉంటే అప్పు ప్రేమ విషయం తానే అందరికి తెలిసేలా చేసింది. అంతే కానీ ప్రేమను చంపుకోమని చెల్లెలిని బతిమిలాడేది కాదు. కావ్య పెళ్లి జరగడానికి కారణం మీరే. నా జీవితం నాశనం చేయాలని చూసింది మీరే.
సైలెంట్‌గా కళ్యాణ్ పెళ్లి జరుగుతుంటే అప్పు ప్రేమ విషయం బయటపెట్టింది మీరే అని రుద్రాణిపై ఫైర్ అవుతుంది. ఇంకోసారి నా చెల్లి గురించి గానీ..నా గురించి గానీ ఎవరైనా మాట్లాడితే అంటూ రుద్రాణితో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్‌కు వార్నింగ్ ఇస్తుంది. స్వప్నను ఆపిన కావ్య ఆమెను అక్కడి నుంచి తీసుకెళుతుంది.
ఇందిరాదేవి సపోర్ట్…
స్వప్న, కావ్య వెళ్లిపోగానే వారిపై రుద్రాణి ఫైర్ అవుతుంది. స్వప్న చేత కావ్యనే ఇలా కోపంగా మాట్లాడించిందని అంటుంది. ఆమె మాటలను ఆపేయమని వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. కావ్యను ఇందిరాదేవి సపోర్ట్ చేయడం ధాన్యలక్ష్మి, అపర్ణతో పాటు రుద్రాణి తప్పుపడతారు. పుట్టింటికి కావ్య వెళ్లొద్దని అంటారు. అత్తింట్లో ఎలా ఉండాలో కోడళ్లకు చెప్పడం వరకు మీకు హక్కు ఉందని, కాదని అంటే రుద్రాణికి జరిగినట్లే మీకు అవమానం జరుగుతుందని ఇందిరాదేవి అంటుంది. ఆమె మాటలతో అపర్ణ, ధాన్యలక్ష్మి లోలోన అసహనానికి లోనవుతారు.
సినిమా చూపిస్తా…
స్వప్నను తన రూమ్‌లోకి తీసుకొస్తుంది కావ్య. ఆమె కోపాన్ని కంట్రోల్ చేయబోతోంది. కానీ స్వప్న మాత్రం కావ్య మాటలను వినదు. ప్రతి దానికి మనల్ని తప్పు పట్టడం వీళ్లకు అలవాటుగా మారిపోయిందని, సైలెంట్‌గా ఉంటే ఇంకా రెచ్చిపోతారని చెబుతుంది. మెత్తగా మాట్లాడితే ఇలాగే ఉంటారని, ఇక నుంచి అత్తకు, మా ఆయనకు సినిమా చూపిస్తానని కావ్యతో అంటుంది స్వప్న.
రుద్రాణి ప్లాన్…
కావ్యపై అపర్ణ, ధాన్యలక్ష్మి మనసుల్లో ఉన్న ద్వేషాన్ని మరింత పెంచుతుంది రుద్రాణి. అనామికను కూడా కావ్య తనవైపుకు తిప్పుకునే ప్రమాదం ఉందని ధాన్యలక్ష్మితో అంటుంది. నా కోడలి జోలికి వస్తే ఊరుకోననిఅంటుంది ధాన్యలక్ష్మి. కావ్యకు సమాధానం చెప్పాల్సిన టైమ్ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు అపర్ణ అనుకుంటుంది. ఆ టైమ్ వస్తే ఆమెను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతానని చెబుతుంది.
దోషిగా కావ్య…
సత్యనారాయణ వ్రతానికి ఏర్పాట్లు చేస్తుంటుంది కావ్య. దీపపు కుందెను రుద్రాణి కిందపడేస్తుంది. ఆ తప్పును కావ్యపై నెట్టివేస్తుంది. నిజంగానే దీపపు కుందెను కావ్యనే కిందపడేసిందని రుద్రాణి ఆమెపై ఫైర్ అవుతుంది.