Best Web Hosting Provider In India 2024
Chiranjeevi: ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో చిరంజీవి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు మర్చిపోయాడు. ప్రశాంత్ వర్మ పేరును సురేష్ వర్మ అంటూ చిరంజీవి పేర్కొన్నడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రెండింగ్ వార్తలు
ట్రైలర్, టీజర్స్ బాగున్నాయని, దర్శకుడు ఎవరో అనే ఎంక్వైరీ చేస్తే సురేష్ వర్మ అని తెలిసిందని చిరంజీవి అన్నాడు. ప్రశాంత్ వర్మ పేరును సురేష్ వర్మ అని తప్పుగా చిరంజీవి చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా నయం ప్రశాంత్ నీల్ అనలేదంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా చిరంజీవి స్పీచ్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మతో పాటు తేజా సజ్జా నా దగ్గరకు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రమ్మని రిక్వెస్ట్ చేశానని, వారి కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చినట్లు చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నాడు.
మా ఇంట్లో అందరూ కమ్యూనిస్ట్‌లే…
చిరంజీవి మాట్లాడుతూ మా ఇంట్లో భక్తులెవరూ లేరని చిరంజీవి అన్నాడు. నాన్న కమ్యూనిస్ట్ అని చిరంజీవి చెప్పాడు. నాన్నకు హనుమాన్ భక్తిని తానే పరిచయం చేశానని, కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తిని దైవ భక్తుడిగా తానే మార్చానని చిరంజీవి ఈ వేడుకలో తెలిపాడు. సెంటిమెంట్‌గా తన దగ్గర ఓ హనుమాన్ కాయిన్ ఉండేదని, పాత సినిమాలు చూస్తే ఆ కాయిన్ తన మెడలో కనిపించేదని చిరంజీవి అన్నాడు. అన్నయ్య టైమ్‌లో అనుకోకుండా ఆ కాయిన్ మిస్సయిందని చిరంజీవి చెప్పాడు. సినిమాకు హనుమాన్ టైటిల్ పెట్టడానికి తానే కారణమని ప్రశాంత్ వర్మ గుర్తుచేయడం ఆనందంగా ఉందని చిరంజీవి పేర్కొన్నాడు.
హనుమాన్‌లో చిరంజీవి…
హనుమాన్ మూవీలో చిరంజీవి అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హనుమాన్ పాత్రలో చిరంజీవి కొద్ది క్షణాల పాటు ఈ సినిమాలో కనిపిస్తారని అంటున్నారు. ఆడియెన్స్‌కు సర్‌ప్రైజింగ్‌గా ఉండాలనే చిరంజీవి క్యారెక్టర్‌ను సినిమా యూనిట్ రివీల్ చేయలేదని అంటున్నారు. హనుమాన్‌లో చిరంజీవి నటిస్తున్నాడా? లేదా? అన్నది సస్పెన్స్ అంటూ ప్రశాంత్ వర్మ కూడా ప్రమోషన్స్‌లో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.
మైథలాజికల్ పాయింట్‌తో…
హనుమాన్ మూవీలో తేజా సజ్జా హీరోగా నటిస్తోన్నాడు. మైథలాజికల్ పాయింట్‌తో సూపర్ హీరో కథాంశంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలకు పోటీగా హనుమాన్ రిలీజ్ కావడం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాంబీరెడ్డి తర్వాత తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.లో రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది.