Upendra UI Teaser: ఇది ఉపేంద్ర తీసుకొచ్చిన యూఐ ప్రపంచం.. టీజర్ అదుర్స్

Best Web Hosting Provider In India 2024

Upendra UI Teaser: కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర ఇప్పుడు యూఐ (UI) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్ లో ఈ మూవీ పోస్టర్ తోనే ఇంటర్నెట్ లో సెన్షేషన్ క్రియేట్ చేసిన అతడు.. తాజాగా సోమవారం (జనవరి 8) ఫస్ట్ లుక్ టీజర్ ద్వారా అంచనాలను మరో లెవల్ కు తీసుకెళ్లాడు.

ట్రెండింగ్ వార్తలు

ఉపేంద్ర నటించి, డైరెక్ట్ చేసిన ఈ యూఐ మూవీ టీజర్ మనల్ని ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇది ఏఐ వరల్డ్ కాదు.. యూఐ వరల్డ్ అని బ్యాక్‌గ్రౌండ్ లో వినిపించే ఓ వాయిస్ తో టీజర్ మొదలవుతుంది. సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ లో తర్వాత మరో డైలాగ్ వినిపించదు. కానీ ఊహకందని విజువల్స్ తో కట్టి పడేస్తుంది.

ఇందులోని స్పెషల్ ఎఫెక్ట్స్, స్టంట్స్, చివర్లో ఉపేంద్ర ఎంట్రీ.. అన్నీ ఓ డిఫరెంట్ ఫీల్ అందిస్తాయి. టీజర్ లో ఓ యువకుడు, యువతి ఎంట్రీతోనే యూఐ మూవీ మన ఊహలకు కూడా అందని స్టోరీతో రాబోతోందని అర్థమవుతుంది. ఈ టీజర్ ను మేకర్స్ సోమవారం సోషల్ మీడియా ద్వారా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. “వెల్‌కమ్ టు ద వరల్డ్ ఆఫ్ యూఐ” అనే క్యాప్షన్ తో ఉపేంద్ర ఈ టీజర్ ను పోస్ట్ చేశాడు.

అసలేంటీ యూఐ మూవీ?

ఈ టీజర్ ద్వారా సినిమా అసలు స్టోరీ ఏంటన్నది ఏమాత్రం రివీల్ కాలేదు. జైల్లో బంధీలైన కొన్ని వందల మంది హాహాకారాలు, భిన్నమైన గెటప్‌లతో కనిపించే పాత్రలు, చివరల్లో వాళ్లను ఆదుకోవడానికి గుర్రంపై ఎంట్రీ ఇచ్చే హీరో.. ఇలా టీజర్ అంతా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది.

2015లో ఉప్పి 2 మూవీ తర్వాత ఉపేంద్ర మరోసారి డైరెక్టర్ గా మారి ఈ యూఐ మూవీ తీస్తున్నాడు. అతనికి కెరీర్లో డైరెక్టర్ గా ఇది 11వ సినిమా. రూ.100 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమా మొత్తాన్ని ఓ వర్చువల్ రియాల్టీ సెటప్ లో తీసినట్లు మేకర్స్ చెబుతున్నారు. దీనికోసం ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ క్రియేషన్ టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో 90 శాతం గ్రాఫిక్స్ ఉంటాయని ఆ మధ్య ఉపేంద్ర చెప్పడం విశేషం.

వీటిని నాలుగు భిన్నమైన స్టూడియోల్లో రూపొందించినట్లు కూడా అతడు చెప్పాడు. ఈ సినిమాలో ఉపేంద్రతోపాటు రీష్మా, సన్నీ లియోనీ, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, ఇంద్రజిత్ లంకేష్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. లహరి ఫిల్మ్స్ బ్యానర్ కింద ఈ మూవీ నిర్మితమవుతోంది. నిజానికి గతేడాది డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే చాలా ఆలస్యం అవుతోంది. తాజా రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. 2022, జూన్ లోనే ఉపేంద్ర ఈ మూవీని అనౌన్స్ చేశాడు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టీజర్ లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోనే అతడు తన మార్క్ చూపించాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024