CEO Mukesh Kumar Meena : ఏపీలో 5.64 లక్షల ఓట్లు తొలగింపు, 50 మంది బీఎల్వోలపై చర్యలు- సీఈవో ముఖేష్ కుమార్ మీనా

Best Web Hosting Provider In India 2024

CEO Mukesh Kumar Meena : ఏపీ ఓటర్ల తుది జాబితాపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఓటర్ల అభ్యంతరాలు, దొంగ ఓట్ల తొలగింపు ఇలా వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్ల జాబితా తయారీలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామన్నారు. డిసెంబరు 9 తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను ఈ నెల 12 లోగా పరిష్కరిస్తామన్నారు. విజయవాడలో సీఈవో ముకేశ్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. వివిధ రాజకీయ పార్టీల ఫిర్యాదులతో 14.48 లక్షల ఓట్లను పరిశీలించి 5,64,819 ఓట్లను అనర్హమైనవిగా గుర్తించామన్నారు. ఓటర్ల జాబితా నుంచి అనర్హులను కలెక్టర్లు తొలగించారని వెల్లడించారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. గందరగోళం లేకుండా ఓటరు జాబితాను రూపొందించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

పర్చూరులో 10 ఎఫ్ఐఆర్ లు

కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయన్న విషయంపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పందించారు. కాకినాడ, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఫామ్-7 ద్వారా భారీగా ఓటర్లను చేరుస్తున్న 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పలువురిపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టామన్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్‌వోలపై కూడా చర్యలు తీసుకున్నామన్నారు. పర్చూరులో 10 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశామన్నారు. పర్చూరు సీఐ, ఎస్ఐ, ఈఆర్వో సస్పెండ్ అయ్యారని తెలిపారు. ఉరవకొండ, ప్రొద్దుటూరు ఈఆర్వోలను కూడా సస్పెండ్ చేశామన్నారు.

50 మంది బీఎల్వోలపై చర్యలు

జీరో డోర్ నెంబర్లు, ఒకే ఇంటిలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న కేసుల్లో తనిఖీలు పూర్తి చేసి, ఓటర్ల జాబితాను సవరించామన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లకు వేరు వేరు పోలింగ్ కేంద్రాలకు మారిన ఘటనలు విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదయ్యాయని సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చర్యలకు గురైన వారు ఎన్నికల్లో విధుల్లో ఉండరన్నారు. ఇప్పటివరకు 50 మంది బీఎల్వోలపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించామన్నారు.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024