Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu January 9th Episode: తన తండ్రి చక్రపాణి ఇంట్లో రిషికి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తుంటుంది వసుధార. రిషి ఆచూకీ ఎవరికి చెప్పకుండా రహస్యంగా దాచిపెడుతుంది. అయినా వసుధార…చక్రపాణి ఇంట్లో ఉన్న విషయం శైలేంద్ర కనిపెడతాడు. రిషి కూడా వసుధారతో పాటే ఉన్నాడని శైలేంద్ర అనుమానపడతాడు. భద్రకు చక్రపాణి అడ్రెస్ ఇచ్చి అక్కడ రిషి ఉన్నాడో లేదో తెలుసుకోమని పంపిస్తాడు.
ట్రెండింగ్ వార్తలు
తనను వెతుక్కుంటూ వచ్చిన భద్రను చూసి వసుధార షాకవుతుంది. వసుధారను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు భద్ర. రిషి గురించి కూపీ లాగేందుకు ప్రయత్నిస్తాడు. భద్రపై వసుధారలో అనుమానం మొదలవుతుంది. ఉద్యోగం నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో భద్ర వెనక్కి తగ్గుతాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
భద్ర…శైలేంద్ర మనిషి…
ఆ తర్వాత మహేంద్రకు ఫోన్ చేసి భద్ర గురించి చెబుతుంది వసుధార. ఎవరు అడ్రెస్ ఇవ్వకుండానే అతడు తమ దగ్గరకు ఎలా వచ్చాడని మహేంద్రను అడుగుతుంది. వసుధార మాటలతో భద్రపై మహేంద్రలో డౌట్ మొదలవుతుంది. ఆ తర్వాత భద్ర శైలేంద్ర మనిషి అని వసుధార కూడా అనుమానపడుతుంది. మన అడ్రెస్ తెలుసుకొని మరి వచ్చాడంటే…ఎవరో తెలిసిన వాళ్లే ఇక్కడికి పంపించి ఉంటారని తండ్రితో అంటుంది వసుధార.
మా గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం శైలేంద్రకు తప్ప ఎవరికి లేదని అంటుంది. మన గురించిన సమాచారం మొత్తం తెలుసుకొని శైలేంద్రకు చెప్పడానికే భద్ర ఇక్కడికి వచ్చాడని తండ్రికి చెబుతుంది. ఎవరిని నమ్మడానికి వీలు లేదని, ఏ చిన్న పొరపాటు చేసినా రిషి ప్రాణాలకే ప్రమాదమని తండ్రితో అంటుంది. రిషి కి కాపలాగా తాను ఉంటానని, నా ప్రాణం అడ్డువేసి మీ ఇద్దరిని కాపాడుకుంటానని కూతురికి మాటిస్తాడు చక్రపాణి.
మహేంద్ర ఫైర్…
వసుధార దగ్గర నుంచి ఇంటికి వచ్చిన భద్రపై మహేంద్ర ఫైర్ అవుతాడు. వసుధార దగ్గరకు ఎందుకు వెళ్లావు. ఆమె అడ్రెస్ నీకు ఎవరిచ్చారు? అని నిలదీస్తాడు. తన తండ్రి దగ్గర ఉన్నట్లు వసుధార స్వయంగా ఫణీంద్రతో చెప్పిందని..కాలేజీలో మాట్లాడుకుంటుంటే విని వసుధార క్షేమంగా ఉన్నారో లేదో కనుక్కోవడానికి ఆమె దగ్గరకు వెళ్లానని భద్ర డ్రామా అడుతాడు.
మీరు నన్ను అనుమానిస్తే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనని అంటాడు. నమ్మకం లేని చోట భద్ర పనిచేయడని అంటాడు. నాలాంటి మంచివాళ్లను అనుమానిస్తే మీరే బాధపడతారు. మీ అనుమానాలు చూస్తుంటే చచ్చిపోవాలని అనిపిస్తుందని సింపథీతో మహేంద్రను బోల్తా కొట్టిస్తాడు భద్ర.
రిషి శత్రువు ఎవరు?
తన దగ్గరకు వచ్చిన వసుధారను జగతి కేసు ఏమైందని అడుగుతాడు రిషి. శైలేంద్ర తప్పుడు సాక్ష్యాలను సృష్టించి కేసు నుంచి ఎలా బయటపడింది రిషికి వివరిస్తుంది వసుధార. అమ్మ చావుకు కారణం ఎవరో తెలుసుకునే వరకు నా మనసు కుదుటపడదు. అసలు ఎవరికి కనిపించకుండా ఎందుకు దాక్కోవాలి. ఎందుకు అందరిని ఫేస్ చేయకూడదు అని లేవబోతాడు రిషి.
కానీ వసుధార అతడిని వారిస్తుంది. ఈ సమయంలో మీ ఉనికి మీ నీడకు కూడా తెలియకూడదు. రౌడీలు మీ కోసమే వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ల కంట పడితే ప్రమాదమని రిషిని హెచ్చరిస్తుంది. నా మాట కాదనకండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది.
అసలు మన శత్రువు ఎవరై ఉంటారు. ఇవన్నీ మా అన్నయ్య చేసి ఉంటాడా? ఈ కుట్రలకు కారణం శైలేంద్రనేనా అని వసుధారను అడుగుతాడు రిషి. తొందరలోనే అన్ని తెలుస్తాయని, తెలిసేలా చేస్తానని రిషితో అంటుంది వసుధార. అసలు మన శత్రువులు ఎవరు, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారన్నది తెలిసే రోజు దగ్గరలోనే ఉందని రిషికి సర్ధిచెబుతుంది వసుధార.
ధరణి ఆలోచనలు…
శైలేంద్ర ఇంటికొచ్చేసరికి ధరణి సీరియస్‌గా ఆలోచనల్లో మునిగి కనిపిస్తుంటుంది. అది శైలేంద్ర కనిపెడతాడు. ధరణి ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవాలని ఆమెకు కనిపించకుండా దాక్కుంటాడు. తండ్రి ఇంటికి వసుధార ఎందుకు వెళ్లిందోనని ధరణి ఆలోచిస్తుంటుంది. వసుధార..రిషిని కాపాడి తన తండ్రి దగ్గరకు తీసుకెళ్లి ఉంటుందని ధరణి అనుకుంటుంది. రిషి ప్రాణాలకు ప్రమాదమనే అలా చేసి ఉంటుందని నిశ్చయించుకుంటుంది.
రిషిని చూడాలని ధరణి తాపత్రయపడుతుంది. రిషి మీద అసూయతో తన భర్త ఎన్నో దుర్మార్గాలకు పాల్పడుతున్నాడని ఆవేదనకు లోనవుతుంది. మహేంద్ర ద్వారా రిషిని కలవాలని అనుకున్న ధరణి అతడి ఇంటికి బయలుదేరుతుంది. భార్య ప్లాన్ ఏమిటో తెలుసుకోవాలని ధరణిని శైలేంద్ర ఫాలో అవుతుంటాడు. శైలేంద్ర తనను ఫాలో అవుతోన్న విషయం ధరణి కనిపెట్టలేకపోతుంది.
ధరణికి దొరికిపోయిన శైలేంద్ర…
తండ్రి దగ్గర ఉన్న వసుధార తన దగ్గర ఏదో దాస్తుందని భద్ర ఆలోచిస్తుంటాడు. ఆ విషయమే ఆలోచిస్తుండగా అక్కడికి ధరణి వస్తుంది. మహేంద్ర కోసం ఇంట్లో వెతుకుతుంటుంది. మహేంద్ర బయటకు వెళ్లాడని ధరణితో అంటాడు భద్ర.
మహేంద్ర తో కలిసి వసుధార దగ్గరకు వెళ్లాలని తాను వచ్చినట్లు భద్రతో చెబుతుంది ధరణి. తాను వసుధార దగ్గరకు తీసుకెళ్తానని ధరణితో చెప్పబోతూ సడెన్‌గా ఆగిపోతాడు భద్ర. వసుధార అడ్రెస్ తనకు తెలుసు అని చెప్పడం ప్లస్సవుతుందా? మైనస్ అవుతుందా అని ఆలోచిస్తుంటాడు. మహేంద్రకు ఫోన్ చేయాలని ధరణి అనుకుంటుంది. అనుకోకుండా తనను ఫాలో అవుతోన్న శైలేంద్రను చూస్తుంది ధరణి. భర్త దగ్గరకు వస్తుంది.
శైలేంద్రకు పంచ్…
ఇంట్లో ఎవరూ లేరని శైలేంద్రపై సెటైర్స్ వేస్తుంది ధరణి. దాంతో ఆమె వైపు కోపంగా చూస్తాడు శైలేంద్ర. ప్రతి సారి ఏం చేస్తున్నారు..ఏం చేయబోతున్నారని మీ గురించి నేను ఆలోచించేదానిని. కానీ ఇప్పుడు మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. నాపై నిఘాపెట్టారు. నన్ను ఫాలో అవుతూ వచ్చారు కదా అని శైలేంద్రతో అంటుంది ధరణి. మావయ్యగారు మిమ్మల్ని దారితప్పకుండా జాగ్రత్తగా చూసుకోమని నాతో చెప్పారని భర్తతో అంటుంది ధరణి.
అసలే శైలేంద్ర ఉట్టివెధవ, దద్దమ్మ…పనికిమాలినవాడు. చెట్టంత పెరిగినా అవగింజంత మెదడు లేదని మామయ్యతో తనతో అంటూ ఉంటారని భర్తను ఎగతాళి చేస్తుంది ధరణి. ఎంత చెప్పిన మీరు దారితప్పే పనులే చేస్తారు. అడ్డదారుల్లోనే నడుస్తారని భర్తపై తన మనసులో ఉన్న ద్వేషాన్ని మొత్తం బయటపెడుతుంది.
ధరణికి వార్నింగ్…
ఫణీంద్ర పేరు చెప్పి శైలేంద్రను చెడమడా వాయిస్తుంది. ధరణి మాటలతో శైలేంద్ర ఫైర్ అవుతాడు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిదని భార్యకు వార్నింగ్ ఇస్తాడు. మీరు నన్ను ఫాలో అయిన విషయం మామయ్యకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నానని శైలేంద్రతో అంటుంది ధరణి.
ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు శైలేంద్ర తనను కలవడానికే వచ్చాడా లేదంటే ధరణిని ఫాలో అవుతూ వచ్చాడా అని భద్ర ఆలోచిస్తుంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.