Best Web Hosting Provider In India 2024
Connect OTT Release: నయనతార (Nayanthara) కనెక్ట్ మూవీ థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ హారర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించబోతున్నది. కరోనా టైమ్… లాక్‌డౌన్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రయోగాత్మకంగా కనెక్ట్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అశ్విణ్ శరవణన్. ఈ సినిమా కథ మొత్తం కంప్యూటర్స్ స్క్రీన్ ప్రధానంగానే సాగుతుంది.
ట్రెండింగ్ వార్తలు
నెట్‌ఫ్లిక్స్‌లో కనెక్ట్…
2022 డిసెంబర్‌లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన కనెక్ట్ మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకున్నది. కానీ సినిమా థియేటర్లలో విడుదలై ఏడాదిపైనే అయినా ఇప్పటివరకు ఓటీటీలో మాత్రం రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ దిశగా ప్రయత్నాలు సాగుతోన్నట్లు తెలిసింది. జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కనెక్ట్ మూవీ ఓటీటీ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కనెక్ట్ ఓటీటీ రిలీజ్ డేట్‌ఫై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
సత్యరాజ్…
కనెక్ట్ మూవీలో నయనతారతో పాటు వినయ్‌రాయ్, సత్యరాజ్ (Satyaraj) కీలక పాత్రలు పోషించారు. అనుపమ్‌ఖేర్ అతిథి పాత్రలో నటించాడు. దుష్ట ఆత్మ నుంచి తన కూతురిని కాపాడుకోవడానికి తల్లి చేసే పోరాటం నేపథ్యంలో కనెక్ట్ మూవీ తెరకెక్కింది. ఇందులో నయనతార యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. కంప్యూటర్స్ స్క్రీన్స్ ప్రధానంగా కథ నడవడం అనే పాయింట్ మినహా మిగిలిన అంశాల్లో కొత్తదనం లేకపోవడంతో ఈసినిమా కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.
లెంగ్త్ 99 నిమిషాలే…
కనెక్ట్ మూవీని లెంగ్త్ 99 నిమిషాలే కావడంతో ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేయాలని యూనిట్ భావించింది. కానీ థియేటర్ వర్గాలు అందుకు అంగీకరించకపోవడంతో ఆ నిర్ణయంపై సినిమా టీమ్ వెనక్కి తగ్గింది. కనెక్ట్ మూవీని నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మించాడు. పెళ్లి తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి చేసిన మొదటి సినిమా ఇది.
బాలీవుడ్‌లోకి నయన్ ఎంట్రీ…
2023 ఏడాదిలో జవాన్ (Jawan) సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. షారుఖ్‌ఖాన్ హీరోగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 1150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. జవాన్ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఇందులో నర్మద అనే టాస్క్‌ఫోర్స్ పోలీస్ పాత్రలో నయనతార కనిపించింది. యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేసింది.
ఓటీటీలో దుమ్మురేపుతోంది…
నయనతార హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ అన్నపూర్ణి ఇటీవల రిలీజైంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా మిగలగా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ మూవీ నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ గా నిలిచింది. ప్రస్తుతం తమిళంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో టెస్ట్ అనే సినిమా చేస్తోంది నయనతార. ఇందులో సిద్ధార్థ్, మాధవన్ హీరోలుగా నటిస్తోన్నారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో నయనతార చేస్తోన్న మంగట్టి మూవీ షూటింగ్ దశలో ఉంది.