Best Web Hosting Provider In India 2024
అధిక బరువు అనేది అనేక ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఆహార శైలిలో మార్పులు, వ్యాయమాలు.. ఇలా చాలా కష్టపడినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. అయితే కొన్ని రకాల చిట్కాలు ప్రభావవంతంగా ఉంటాయి. అందులో ఒకటి యాపిల్ జ్యూస్ తాగడం.
ట్రెండింగ్ వార్తలు
ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పని భారం, ఒత్తిడి మొదలైనవి దీనికి ప్రధాన కారణాలు. బరువు తగ్గేందుకు చాలా మంది రకరకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదని ఆందోళన చెందుతుంటారు. అందుకే బరువు తగ్గించే జ్యూస్ తయారు చేయండి. ఈ బరువు తగ్గించే జ్యూస్ ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా చేస్తే వారం రోజుల్లోనే తేడా కనిపిస్తుంది.
బరువు తగ్గించే యాపిల్ జ్యూస్ తయారు చేయడం చాలా ఈజీ. గ్రీన్ టీ – 1 ప్యాకెట్, యాపిల్ – తరిగిన 1 కప్పు, అల్లం – 1/4 కప్పు, ఆపిల్ సైడర్ వెనిగర్ – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.
ముందుగా గ్రీన్ టీ బ్యాగ్ తీసుకుని 200మి.లీ వేడి నీటిలో వేసి బాగా నానబెట్టాలి. తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులో 1 కప్పు మీడియం సైజ్ యాపిల్ కట్ చేసి వేయండి. దానితో పాటు తురిమిన అల్లం ముక్క, యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పటికే సిద్ధం చేసుకున్న గ్రీన్ టీ వాటర్ సహా అన్ని పదార్థాలను వేయాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి.
తర్వాత పదార్థాలన్నీ కలిపి మిక్సీలో పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ తయారుచేసిన బరువు తగ్గించే జ్యూస్ ఫిల్టర్ చేయకూడదు. దీన్ని టంబ్లర్‌లో పోసి తాగితే చాలు. ఫలితం కనిపిస్తుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఆరోగ్యానికి చాలా మంచిది.
దీనితోపాటుగా బరువు తగ్గేందుకు తాజా ఆహారం తీసుకోవాలి. రోజు వ్యాయామం చేయాలి. వాకింగ్ చేస్తూ ఉండాలి. కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తినడం మంచిది కాదు. ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవాలి. పండ్లు తినేందుకు ఇష్టపడాలి. మటన వంటి కొవ్వు అధికంగా ఉండే ఫుడ్ తగ్గించాలి. చేపలతో కొవ్వు సమస్య రాదు.. సో.. నాన్ వెజ్ ఇష్టపడేవారు చేపలు, రొయ్యలు వంటి వాటిని తినాలి.
అధిక బరువుతో గుండె సమస్యలు వస్తాయి. ఊబకాయంతో మానసిక స్థితి మీద కూడా ప్రభావం పడుతుంది. డిప్రెషన్ వెళ్తారు. దీంతో మానసిక ఆరోగ్యం కూడా చెడిపోతుంది. శ్వాసకోశ సమస్యలు కూడా అధిక బరువుతో వస్తాయి. శరీరంలో కొవ్వు అధికమైతే.. ఊపిరితిత్తుల వాయు మార్గాలు సంకోచిస్తాయి. అధిక బరువు వలన అన్నీ నష్టాలే. ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవాలి. అప్పుడే శరీరానికి మంచిది.