సీఎం వైయ‌స్ జగన్, చంద్రబాబు పాలన బేరీజు వేసుకుని ఓటు వేయండి.. 

Best Web Hosting Provider In India 2024

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

శ్రీ‌ సత్యసాయి జిల్లా: వచ్చే ఎన్నికల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌ , చంద్రబాబు పాలన బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలనిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  విజ్ఞప్తి చేశారు. హిందూపూర్‌ నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కొనసాగుతోంది.  ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ..వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99.5 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిదే అన్నారు. కరోనా సమయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్.. హైదరాబద్ లో దాక్కున్నారని దుయ్యబట్టారు.

 సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎక్కడా కులాలు, మతాలు, పార్టీలు చూడలేదు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించారని ప్రశంసలు కురిపించారు. పాలన అంతా ప్రజల ఇంటి ముందు ఉన్న సచివాలయంలోనే ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లాగా జన్మభూమి కమిటీలను వేసి ప్రజల్ని దోచుకునే పరిస్థితి లేదు.. నేరుగా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ అని కొనియాడారు.. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బటన్‌ నొక్కి లబ్ధిచేకూరుస్తున్నారని తెలిపారు. మరోవైపు.. పెన్షన్ లు పెంచి రూ.3,000 చేస్తే… పెన్షన్ ఇవ్వరు అంటూ టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మండిపడ్డారు. 

Best Web Hosting Provider In India 2024