Best Web Hosting Provider In India 2024

The Trial Telugu Movie OTT: క్రైమ్ ఇంటరాగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చిన తెలుగు సినిమా ‘ది ట్రయల్’ మోస్తరు టాక్ తెచ్చుకుంది. గతేడాది నవంబర్ 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టింది. అయితే, అంతగా ప్రమోషన్లు జరగకపోవటంతో చాలా మందికి ఈ చిత్రం గురించి తెలియలేదు. స్పందన పిళ్లై, యుగ్రామ్, వంశీ కొటు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు, ది ట్రయల్ మూవీ ఓటీటీలోకి సడెన్‌గా అడుగుపెట్టింది.
ట్రెండింగ్ వార్తలు
ది ట్రయల్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ముందస్తు ప్రచారం లేకుండానే సడెన్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో తెలుగులో ది ట్రయల్ స్ట్రీమ్ అవుతోంది.
ఇంటెరాగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా ది ట్రయల్ చిత్రానికి రామ్ రామ్ గన్నీ దర్శకత్వం వహించారు. స్పందన, యుగ్ రామ్, వంశీతో పాటు ఉదయ్ పులిమె, సాక్షి ఉత్తాడ, జశ్వంత్ పెరుమాళ్ల, వజీర్ ఇషాన్ కూడా కీలకపాత్రల్లో కనిపించారు. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించగా.. శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు.
‘ది ట్రయల్’ కథ ఇదీ
పోలీస్ ఆఫీసర్ రూప (స్పందన) వివాహ తొలి వార్షికోత్సవం రోజున ఆమె భర్త అజయ్ (యుగ్ రామ్) ఓ బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మరణిస్తాడు. అయితే, అజయ్ కుటుంబం రూపపై అనుమానం వ్యక్తం చేస్తుంది. అజయ్‌ను రూప హత్య చేసిందని అనుమానిస్తారు. ఈ కేసును రాజీవ్ (వంశీ కొటు) దర్యాప్తు చేస్తారు. ఈ క్రమంలో స్పందన, యుగ్ రామ్ మధ్య జరిగిన కొన్ని షాకింగ్ విషయాలు బయటికి వస్తాయి. దర్యాప్తు లోతుగా సాగుతుంది. మరి అజయ్ మృతి ప్రమాదమా.. హత్యనా? దర్యాప్తులో ఏం తేలింది? మిస్టరీ ఏంటి? అనేదే ది ట్రయల్ సినిమా కథగా ఉంది.
క్రైమ్ థ్రిల్లర్‌గా సస్పెన్స్ అంశాలతో వచ్చిన ది ట్రయల్ కథ పరంగా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అయితే, కథనం నిదానంగా సాగడమే ఈ మూవీలో కాస్త మైనస్‌గా నిలిచింది. నటీనటుల పర్ఫార్మెన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మెరుగ్గా ఉంటాయి.
ట్రెండింగ్‌లో ‘కాదల్ – ది కోర్’
Kaathal – The Core OTT: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ప్రముఖ నటి జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన కాదర్ – ది కోర్ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
కాదల్ – ది కోర్ చిత్రానికి ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే అంతకు మంచిన రేంజ్లో ఆదరణ పొందుతోంది. దీంతో ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్లో ప్రస్తుతం కాదల్ ది కోర్ చిత్రం టాప్-10లో ట్రెండ్ అవుతోంది.
కాదల్ – ది కోర్ చిత్రానికి జో బేబి దర్శకత్వం వహించారు. హీరో మమ్మూట్టినే నిర్మాతగా వ్యవహరించగా.. మాథ్యూస్ పులికన్ సంగీతం అందించారు. ఓ ఇబ్బందికర కారణం వల్ల తన భార్య విడాకులు అడగడంతో ఓ బ్యాంక్ మేనేజర్ జీవితం ఎలా మారిందన్న అంశం చుట్టూ కాదర్ – ది కోర్ కథ ఉంటుంది.