Best Web Hosting Provider In India 2024

APPSC Server Issue : నిరుద్యోగులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తుంది. గ్రూపు-1, 2 పోస్టులకు అప్లై చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తుండగా సర్వర్ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు కొన్నిసార్లు వెబ్‌సైట్ తెరుచుకోవడం లేదంటున్నారు. మరికొన్ని సార్లు ఓటీపీఎఆర్ వివరాలు నమోదు సమయంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో అభ్యర్థులు తలలుపట్టుకుంటున్నారు. అప్లికేషన్ లో వివరాలు పూర్తి చేసి పేమెంట్ పే చేసే సమయంలో ఎర్రర్ వస్తుందని చెబుతున్నారు. దీంతో అభ్యర్థుల మళ్లీ అన్ని వివరాలు నమోదు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. రేపటితో గ్రూప్ 2 దరఖాస్తులకు గడువు ముగుస్తుంది. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో సర్వర్ లో సమస్యలు వస్తున్నాయని ఏపీపీఎస్సీ అధికారులు అంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు
దరఖాస్తుకు తిప్పలు
ఏపీపీఎస్సీ గ్రూప్-1, 2 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. గ్రూప్-1 కు జనవరి 1న అప్లికేషన్లు ఓపెన్ అయ్యాయి. గ్రూప్-2 కు డిసెంబర్ 21న ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నిర్వహణ అధ్వానంగా ఉందని అభ్యర్థులు అంటున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు రోజుల తరబడి ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. గ్రూప్-1, 2 దరఖాస్తు చేయడానికి ముందుగా అభ్యర్థులు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి ఏపీపీఎస్సీ ఒక ఐడీ ఇస్తుంది. దానికి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి. అనంతరం దరఖాస్తులో అభ్యర్థుల వివరాలు నమోదు చేసుకోవాలి. చివరిగా పేమెంట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
స్పందించని ఏపీపీఎస్సీ?
వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడమే సమస్యగా ఉంటే, చివరికి ఓపెన్ అయిన వెంటనే ఎర్రర్ మేసెజ్ డిస్ ప్లే అవుతుందని అభ్యర్థులు అంటున్నారు. సర్వర్ లో సాంకేతిక సమస్యలతో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులో వివరాలు నమోదు, పేమెంట్ సమయాల్లో పదేపదే వెబ్‌సైట్ లాగ్ అవుట్ అవుతుందని అంటున్నారు. ఈ సమస్యలపై ఏపీపీఎస్సీని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఎవరూ సమాధానం చెప్పడంలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో దరఖాస్తు గడువు ముగియడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు కష్టపడి చదివి కనీసం అప్లై చేసుకోలేకపోతున్నామంటున్నారు. ఏపీపీఎస్సీ సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రిపరేషన్ పై దృష్టిపెట్టాల్సిన సమయంలో దరఖాస్తు కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని అభ్యర్థులు అంటున్నారు.