
Best Web Hosting Provider In India 2024

Guntur Kaaram Ticket Prices Hike: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ తరుణంలో గుంటూరు కారం సినిమా కోసం టికెట్ల ధరలను పెంచుకునేందుకు మూవీ మేకర్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై ధరను అదనంగా రూ.100 పెంచేందుకు గుంటూరు కారం మేకర్లకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. అలాగే, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై రూ.65 పెంచుకునేందుకు ఓకే చెప్పింది. వారం పాటు అదనపు ధరలు కొనసాగుతాయి. దీంతో గుంటూరు కారం చిత్రానికి మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ల ధరలు రూ.370, రూ.470గా ఉండే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ల ధరలు రూ.100, రూ.175, రూ.250గా ఉండనున్నాయి.
స్పెషల్ షోలకు కూడా ఓకే
గుంటూరు కారం సినిమా ఆరు షోలను వారం పాటు (జనవరి 12 – 18) ప్రదర్శించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజామున 4 గంటల ప్రత్యేక షోకు ఓకే చెప్పింది. దీంతో వారం పాటు ఆరు షోలకు అవకాశం లభించింది. ఇక, మూవీ రిలీజ్ కానున్న జనవరి 12వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట షోలు వేసేందుకు 23 థియేటర్లకు ఓకే చెప్పింది. ఒంటి గంట షోలు ఒక్క రోజు మాత్రమే ఉండనున్నాయి.
గుంటూరు కారం సినిమా ట్రైలర్ ఆదివారం రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంట్లలోనే 39 మిలియన్ల వ్యూస్ దాటేసింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ ట్రైలర్‌గా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు మరింత అధికమయ్యాయి.
గుంటూరు కారం సినిమాలో రౌడీ రమణగా పక్కా మాస్ యాక్షన్ క్యారెక్టర్ చేశారు మహేశ్ బాబు. ట్రైలర్‌లో సూపర్ స్టార్ యాక్షన్ అదిరిపోయింది. అలాగే, తల్లి సెంటిమెంట్ కూడా ఈ చిత్రంలో ప్రధాన అంశంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, జగపతి బాబు, జయరాం, ఈశ్వరిరావు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, మురళీ శర్మ కీలకపాత్రలు చేశారు.
గుంటూరు కారం చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించగా.. థమన్ సంగీతం అందించారు. హారిక హాసిన క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ ప్రొడ్యూజ్ చేశారు.
టాపిక్