CM Revanth Reddy : తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్ రంగాల్లో అపారమైన అవకాశాలు- సీఎం రేవంత్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024

CM Revanth Reddy : గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సర్వీసెస్, అగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు

స్కిల్ డెవలప్మెంట్ ప్రోత్సహించండి

మంగళవారం సెక్రెటేరియట్ లో గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్ తో పాటు కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్సూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్‌ ను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

బల్లాపూర్ ఇండస్ట్రీస్ పునరుద్ధరణపై

ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారవుతుంది. 2014 లోనే ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించటంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపారు.

 

నేషనల్ కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధీనంలో ఉన్నాయి. ఆ కంపెని ఎండీ హార్దిక్ పటేల్‌, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈఓ వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో సీఎం సచివాలయంలో సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు. మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్‌క్వెస్ట్ బృందాన్ని కోరారు. బిల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. బిల్ట్ మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.

 

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024