Best Web Hosting Provider In India 2024
తెల్లజుట్టు సమస్య నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. వాటిని తగ్గించుకునేందుకు వివిధ చిట్కాలను పాటిస్తున్నారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగించి.. ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమస్యలు ఎక్కువైపోతున్నాయి. కొన్ని ఇంట్లో దొరికే వాటితో తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
నేటి ఆధునిక జీవనశైలిలో జుట్టు తెల్లబడటం పెద్ద సమస్యగా మారింది. 30 ఏళ్లు పైబడిన పురుషులందరూ దీని బారిన పడుతున్నారు. తప్పుడు ఆహారం, జీవనశైలి, జుట్టుకు రసాయనాల వాడకం వంటి వివిధ కారణాల వల్ల తెల్ల జుట్టు సమస్య వస్తుంది. ఈ కారణాల వల్ల వయసు రాకముందే జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది.
తెల్ల జుట్టును పీకడంలాంటివి చేస్తే జుట్టు మూలాలపై చెడు ప్రభావం పడుతుంది. తొలగించిన తెల్ల జుట్టు స్థానంలో కొత్త జుట్టు కొన్నిసార్లు పెరగకపోవచ్చు. మీ జుట్టు సన్నగా మారుతుంది. కొన్ని రకాల వాటిని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
జామకాయ, మెంతి గింజలు, బ్లాక్ టీ, బాదం నూనె, నిమ్మరసం, హెన్నా, కాఫీ, కరివేపాకు వంటి పదార్థాలు తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఉపయోగపడతాయి. జుట్టుకు నలుపు రంగును ఇచ్చే మెలనిన్ లేకపోవడమే తెల్ల జుట్టుకు ప్రధాన కారణం.
కొబ్బరి నూనెను కొంత తీసుకుని.. అందులో ఎండు ఉసిరికాయ ముక్కలు వేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని సన్నని మంటపై వేడి చేయాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత నూనెలో కలిసిపోతాయి. అప్పటి వరకూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే నూనె తయారు అవుతుంది. చల్లారిన తర్వాత వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీంతో తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది.
జుట్టును నల్లగా చేసేందుకు గోరింట, మందారను కూడా ఉపయోగించొచ్చు. వంద గ్రాముల గోరింటాకు, మూడు తాజా మందార పువ్వులు, 20 గ్రాముల వేపాకు, అర ముక్క కర్పూరం బిల్లలు, 200 ఎంఎల్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. వాటిని మంట మీద మరిగించాలి. తర్వాత చల్లార్చి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. నెలుగు నాలుగైదుసార్లు మీ జుట్టుకు అప్లై చేయాలి.
ఎక్కువ ఒత్తిడితో జుట్టుపై ప్రభావం పడుతుంది. నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో అనేక సమస్యలు వస్తాయి. క్రమంగా తెల్ల జుట్టు నల్లబడుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ ధ్యానం చేయాలి. సరిగా నిద్రపోవాలి.
ఇక రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా వాడొద్దు. హెయిర్ ప్రొడక్ట్స్ లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు ఇచ్చినా.. జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను వాడుకోవాలి.