Winter Remedies: చలికాలంలో తరచూ జలుబు, కఫము ఇబ్బంది పెడుతుంటే ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Best Web Hosting Provider In India 2024

Winter Remedies: ఉష్ణోగ్రత తగ్గుతున్న కొద్దీ మన రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. దీనివల్లే దగ్గు, గొంతు నొప్పి, జలుబు వంటివి పెరుగుతూ ఉంటాయి. కఫం విపరీతంగా పట్టేస్తుంది. ఇవి చెప్పటానికి చిన్న సమస్యలైనా అనుభవిస్తున్నప్పుడు మాత్రం ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఇవేవీ రాకుండా కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చూద్దాం. జలుబు, దగ్గు రాగానే వైద్యుల వద్దకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చిట్కాలను పాటించడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు

ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం కొన్ని ములేతి వేర్లను నూరి నీటిలో కలిపి, ఆ నీటిని కాసేపు మరిగించాలి. ఆ మరిగిన నీటిలో అల్లం తురుమును వేసి వేడి చేయాలి. ఆ టీ ని వడకట్టి అందులో తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగితే కఫం పోతుంది. జలుబు, దగ్గు వంటివి తగ్గుతాయి.

జలుబు, దగ్గు వంటి వాటికి ఒక పాత రెమిడి ఉంది. వేడి నీటిలో నిమ్మరసం, రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగితూ మంచిది. రోజులో మూడుసార్లు దీన్ని తీసుకుంటే శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గును తట్టుకునే శక్తి వస్తుంది. దీనిలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇక నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలం. ఇది కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఎక్కువ. ఇది గొంతు నొప్పి తగ్గించడంలో ముందుంటుంది. కాబట్టి గోరువెచ్చని పాలలో ఒక టీ స్పూన్ పసుపు పొడిని కలుపుకొని ప్రతిరోజూ తాగుతూ ఉండండి. చలికాలంలో ఈ రెమిడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

టీ తాగడం ద్వారా కూడా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ టీలో కొన్ని తురిమిన తులసి ఆకులు కలుపుకుంటే మంచిది. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు వేసి అల్లం తురుము, తులసి ఆకులు, నల్ల మిరియాలు వేసి బాగా వేడి చేయాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఈ టీ ని వడకట్టి గ్లాసులో వేయాలి. గోరువెచ్చగా అయ్యాక తేనె, నిమ్మరసం కలిపి తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. శ్వాస సరిగా ఆడేలా చేస్తుంది. ముక్కుదిబ్బడ నుంచి కాపాడుతుంది.

 
WhatsApp channel
 

టాపిక్

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024