
Best Web Hosting Provider In India 2024

Samagra Siksha Jobs: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో ఉద్యోగాల పేరుతో నకిలీ నోటిఫికేషన్ సోసల్ మీడియాలో హల్చల్ చేస్తోందని, నిరుద్యోగ యువత వాటిని నమ్మి మోసపోవద్దని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌డైరెక్టర్ బి. శ్రీనివాసరావు హెచ్చరించారు.
ట్రెండింగ్ వార్తలు
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో పాఠశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కింద పని చేయడానికి ‘యండ్రపల్లి శివ, మేనేజింగ్ డైరెక్టర్, యూత్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్’ పేరిట ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని వివరించారు.
వాట్సాప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న లేఖ నకిలీదని, తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమగ్ర శిక్షా రాష్ట్ర పీడీ స్పష్టం చేశారు.
సమగ్ర శిక్ష తరఫున పాఠశాలల్లో పని చేయడానికి ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేదని, నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూలు చేయడానికే కొందరు ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్నారని వెల్లడించారు. యువతతో పాటు వారి తల్లిదండ్రులు ఇలాంటి ప్రకటనలతో మోసపోకుండా అప్రమత్తమవ్వాలని కోరారు.
యండ్రపల్లి శివ ,మేనేజింగ్ డైరెక్టర్, యూత్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు, ఏపీ సమగ్ర శిక్షాకు ఎలాంటి సంబంధం లేదని, ఆ పేరుతో సమగ్ర శిక్షా కార్యాలయం నుండి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నకిలీ ప్రకటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.
ఆన్‌లైన్‌లో మాత్రమే రియంబర్స్‌మెంట్ బిల్లులు…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లుల ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ సూచించారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ స్కూల్స్ యాజమాన్యాల ఉపాధ్యాయులు సర్వీస్ మ్యాటర్స్ అన్నీ పాఠశాల విద్యాశాఖ, కమీషనర్‌కు బదిలీ అయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ యాజమాన్యాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లుల వారి DDO ద్వారా ఆన్ లైన్ లో నేరుగా YSR TRUST, EHS పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
బిల్లుల్ని అప్ లోడ్ చేయడానికి పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ ESE02-24021/11/2021 MDCL-CSE, Dt. 04/1/2024 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ స్కూల్స్ యాజమాన్యంలో పని చేసే బోధనా సిబ్బంది ఆన్ లైన్ ద్వారా మాత్రమే బిల్లులు సమర్పించాలని కోరారు. ఇకపై మాన్యువల్ గా సమర్పించిన బిల్లులు అనుమతించరని తెలిపారు.