
Best Web Hosting Provider In India 2024

Guntur Kaaram Collections: మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు మూడు వందల కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నాడు. సంక్రాంతి సినిమాల పోటీపై ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
మూడు రోజుల్లో వంద కోట్లు…
సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న గుంటూరు కారం మూవీ మూడు రోజుల్లోనే వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నాడు. తొలిరోజు గుంటూరు కారం మూవీకి వంద కోట్లు కలెక్షన్స్ రావచ్చునని చెప్పాడు. మహేష్‌బాబుకు ఉన్నక్రేజ్ దృష్ట్యా సినిమా బాగుంటే ఫుల్ థియేట్రికల్ రన్లో గుంటూరు కారం మూవీ 300 కోట్ల వరకు రాబడుతుందని తమ్మారెడ్డి భదర్వాజ అంచనా వేశారు. మహేష్ బాబు మంచి క్రౌడ్ఫుల్లర్ కాబట్టి సంక్రాంతికి ఎక్కువ రెవెన్యూ గుంటూరు కారం సినిమాకు వచ్చే అవకాశం ఉందని అన్నాడు.
హనుమాన్ హౌజ్‌ఫుల్ డౌట్…
హనుమాన్ మూవీకి థియేటర్లు తక్కువ కేటాయించారనే ప్రచారాన్ని తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు. ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించిన చాలా వరకు ఖాళీగానే కనిపించే అవకాశం ఉందని తెలిపాడు.. అయితే పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కావడం హనుమాన్కు అడ్వాంటేజ్‌గా మారనుందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పాడు. రాముడి ప్రతిష్ట జరుగుతోన్న టైమ్‌లో సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి హిందీలో ఓపెనింగ్స్ బాగుండే అవకాశం ఉందని తమ్మారెడ్డి భరద్వాజ అంచనా వేశారు. పాన్ ఇండియన్ రిలీజ్ కారణంగా గుంటూరు కారంతో సమానంగా హనుమాన్ ఓపెనింగ్స్ రాబట్టవచ్చని అన్నాడు. థియేటర్ల పంచాయితీ అవసరంగా క్రియేట్ చేశారని, దాని వల్ల సినిమాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నాడు.
సైంధవ్ 60 కోట్లు…
వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ సైంధవ్‌కు ప్లస్సయ్యే అవకాశం ఉందని తమ్మారెడ్డి భరద్వాజ సూచించాడు. సైంధవ్ సినిమాకు థియేట్రికల్ రన్లో 50 నుంచి అరవై కోట్ల వరకు కలెక్షన్స్ రావచ్చునని తమ్మారెడ్డి భరద్వాజ అన్నాడు. సంక్రాంతి సినిమాలపై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
గుంటూరు కారం 200 కోట్ల బడ్జెట్..
గుంటూరు కారం మూవీ దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మరోవైపు హనుమాన్ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగు, తమిళం,హిందీతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో హనుమాన్ రిలీజ్ అవుతోంది. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్‌ను ఒక రోజు ముందుగానే ప్రదర్శించబోతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూసొందుతోన్న సైంధవ్‌తో వెంకటేష్ పాన్ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.