Best Web Hosting Provider In India 2024
Sarkaru Naukari OTT Telease: టాలీవుడ్ సింగర్ సునీత(Singer Sunitha) తనయుడు ఆకాశ్ గోపరాజు (Akash) సర్కారు నౌకరి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది జనవరి 1న థియేటర్ల ద్వారా సర్కారు నౌకరి మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను మేళవించి తెరకెక్కిన ఈ మూవీకి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు. సర్కారు నౌకరి సినిమానుఆర్‌కే టెలిషో పతాకంపై సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాతో భావన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
ఇరవై ఐదు రోజుల్లోనే ఓటీటీలోకి…
సర్కారు నౌకరి మూవీ థియేటర్లలో విడుదలైన ఇరవై ఐదు రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. సర్కారు నౌకరి సినిమాను జనవరి 26న ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. థియేటర్ రిజల్ట్ కారణంగానే సర్కారు నౌకరి సినిమా తొందరగా ఓటీటీలోకి వచ్చేస్తోన్నట్లు తెలుస్తోంది.
సర్కారు నౌకరి కథ ఇదే…
సర్కారు నౌకరి సినిమాలో గోపాల్ పాత్రలో ఆకాష్ గోపరాజు యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు గోపాల్. కండోమ్‌లు పంచే ఉద్యోగం చేస్తున్న అతడికి సొసైటీ నుంచి ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి? అతడిని ఓ అంటరానివాడిగా ఎందుకు చూశారు?
ప్రేమించి పెళ్లి చేసుకున్న సత్య (భావన) కూడా గోపాల్ చేస్తోన్న ఉద్యోగం నచ్చక అతడికి ఎందుకు దూరమైంది ? ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్యోగమే గోపాల్ చేయడానికి కారణం ఏమిటి? అతడి గతం ఏమిటన్నదే సర్కారు నౌకరి మూవీ కథ. కథ బాగున్నా కమర్షియల్‌గా మాత్రం సర్కారు నౌకరి మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.
ఆర్ట్ ఫిల్మ్‌లా…
కమర్షియల్‌గా కథను చెప్పడంతో దర్శకుడు శేఖర్ గంగనమోని తడబాటుకు లోనయ్యాడు. ఆర్ట్ ఫిల్మ్‌లా ఉందంటూ సర్కారు నౌకరిపై విమర్శలొచ్చాయి. యథార్థంగా జరిగిన ఘటనల ఆధారంగా 1996 టైమ్ పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు శేఖర్ గంగనమోని ఈ కథను అల్లుకున్నాడు. ఇందులో తనికెళ్లభరణి, మధులత, మహదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమాకు శాండిల్య బొబ్బిలి, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. గతంలో శేఖర్ గంగనమోని పంచతంత్ర కథలు పేరుతో ఓ సినిమా చేశాడు. మరోవైపు ఆకాశ్ కూడా కొత్త కథలు వింటున్నాడు. నెక్ట్స్ మూవీ లవ్ స్టోరీతో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.