YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.27-10-2022(గురువారం) ..
సంక్షేమం – అభివృద్ధికి సమ ప్రాధాన్యం ..
పట్టణంలోని 10 వ వార్డులో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 10 వ వార్డు పరిధిలో గురువారం ఉదయం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ – ప్రభుత్వ పనితీరును వివరించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుండటంతో పాటు మరోవైపు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ,మూడేళ్ల పాలనలో విద్య -వైద్యం -వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారన్నారు, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ,ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు ,ప్రతి పట్టణం- ప్రతి గ్రామం బాగుండాలనే తపనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు , పట్టణంలో మూడు దశాబ్దాలుగా జరగని అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్ సహకారంతో మూడేళ్ల కాలంలో చేసి చూపించామని చెప్పారు ,నందిగామ నియోజకవర్గంలో 30 ఏళ్ల పాటు ఒకే పార్టీ అధికారంలో ఉన్న పట్టణ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ,ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ,ఏఈ , కౌన్సిల్ మరియు కో ఆప్షన్ సభ్యులు, సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..