YSRCP Nandigama : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన…

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు మండలం :
ది.29-10-2022(శనివారం) ..

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్రజ్ఞుడు ఏపిజే అబ్దుల్ కలాం ..

అబ్దుల్ కలాం విగ్రహా ఏర్పాటు అభినందనీయం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

చందర్లపాడు మండలంలోని రామన్నపేట గ్రామంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారితో కలిసి శనివారం ఆవిష్కరించారు , అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రవేత్తగానే కాకుండా రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు ఎనలేనివన్నారు , దేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి -భారతదేశపు అత్యున్నత పురస్కారాలైన భారతరత్న, పద్మ విభూషణ్ ,పద్మ భూషణ్ , 40 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లతోపాటు ఎన్నో పురస్కారాలు పొందిన గొప్ప వైజ్ఞానిక ప్రబల శక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు ,నిరుపేద కుటుంబం నుంచి తన ప్రతిభతో దేశ అత్యున్నత స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని – నా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు , అదేవిధంగా అబ్దుల్ కలాం కు విద్యార్థులు అంటే ఎంతో ఇష్టమని ,నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులని అటువంటి విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్య ఉచితంగా అందించాలని కలాం ఎప్పుడు అంటుండేవారని ,నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా విధానంలో సమూల సంస్కరణలు తీసుకువచ్చి విద్యార్థులకు ఉచితంగా ఉన్నత స్థాయి ఇంగ్లీష్ మీడియం విద్య అందేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు ,గుడిమెట్ల గ్రామంలో ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ షేక్ కరీంను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేకంగా అభినందించారు ..

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు , స్థానిక ప్రజాప్రతినిధులు ,ముస్లిం మైనార్టీ నాయకులు, పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు , విద్యార్థులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *