YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ(పెద్దవరం) :
ది.29-10-2022(శనివారం) ..
పెద్దవరం గ్రామంలో రూ.1.10 కోట్లతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
పెద్దవరం గ్రామంలో రూ.17 లక్షల అంచనా విలువతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పెద్దవరం గ్రామంలో నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా రూ.18.70 లక్షల విలువతో ఎంపీపీయస్ పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పెద్దవరం గ్రామంలో జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలం లోని పెద్దవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల “మనబడి నాడు-నేడు” కార్యక్రమం లో భాగంగా రూ.1.10 కోట్లతో చేపట్టిన పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి మరియు పలు అభివృద్ధి పనులకు శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శనివారం శంకుస్థాపన నిర్వహించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని , పేద -మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన , ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పని చేస్తున్నారని తెలిపారు , విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మ ఒడి పథకం అందజేయడంతో పాటు జగనన్న విద్యా కానుక- జగనన్న గోరుముద్ద లాంటి పథకాలను కూడా అమలు చేస్తున్నారన్నారు ,
అదేవిధంగా మండల పరిషత్ పాఠశాలలో వంటశాల మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణాలు చేపట్టడంతో పాటు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను -సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రూ.18.70 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించినట్లు తెలిపారు , అనంతరం జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశామని , ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు , జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా పెద్దవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మొదటి కుళాయిని ప్రారంభించారు , అనంతరం గ్రామంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.17 లక్షలు మంజూరయ్యాయని ఆ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి, గ్రామ సర్పంచ్ నానవత్ చిన్నదేవిలి ,ఎంపీపీ వేల్పుల ఏసమ్మ , జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు ,ఎంపీటీసీ సింగంశెట్టి నాగేశ్వరరావు , ఎమ్మార్వో నరసింహారావు , పంచాయతీరాజ్ అధికారి రమేష్ , ఎంఈఓ బాలాజీ నాయక్ ,మండల పార్టీ అధ్యక్షుడు శివ నాగేశ్వరరావు ,కొండా కృష్ణారెడ్డి ,పేరెంట్స్ కమిటీ సభ్యులు ,పాఠశాల ఉపాధ్యాయులు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ..