YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.30-10-2022(ఆదివారం) ..
భగవాన్ శ్రీ సత్యసాయి ఆలయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని గీతా మందిరం వద్ద శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొని శ్రీ సత్యసాయి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .. అనంతరం శ్రీ సత్య సాయి పతాక ఆవిష్కరణ నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ వేద వేదాంతుడైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో ఏకాదశ రుద్రాభిషేకంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ,శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలు నందిగామ సత్య సాయి సేవ సమితి వారు ఎంతో ఘనంగా నిర్వహించారని ,బాబా ఆశీస్సులతో ఆయన భక్తులు మరియు ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ,శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నందిగామ కమిటీ వారిని శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ప్రత్యేకంగా అభినందించారు ..
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవాసమితి కన్వీనర్ యు.వాసు దేవరావు , సభ్యులు శ్రీ సాయిరాం ,ఏ వెంకటేశ్వరరావు , పాలేటి సతీష్ , భక్తులు ,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ..