YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.01-11-2022(మంగళవారం) ..
ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ..
అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు , అనంతరం గాంధీ సెంటర్ లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు పొట్టి శ్రీరాములు అమరులయ్యారని ,ఆయన త్యాగ ఫలితంగానే ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు ,ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు …
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు ,కోఆప్షన్ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..