

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.01-11-2022(మంగళవారం) ..
బుద్ధిలేని శాఖమూరి స్వర్ణలత కి మానసిక పరిస్థితి బాలేదు – ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించాలి : నందిగామ పట్టణ వైసిపి కౌన్సిలర్లు ..
నిన్న జరిగిన నగర పంచాయతీ సాధారణ సమావేశ అనంతరం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ శాఖమూరి స్వర్ణలత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు .. ..
గౌరవ శాసనసభ్యులను ..నువ్వు ఎమ్మెల్యే వా , నువ్వు చైర్మన్ వా ,నువ్వు కౌన్సిలర్ వా , నువ్వు వార్డు మెంబర్ వా అని ..పదే పదే నువ్వు -నువ్వు .. అంటూ ఏకవచనంతో ఉచ్చరిస్తూ నువ్వు దేనికి వస్తున్నావ్ కౌన్సిల్ సమావేశానికి అని ప్రశ్నిస్తున్నావే .. ఎమ్మెల్యే హోదాలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు కౌన్సిల్ సమావేశానికి వస్తే నువ్వు ఎందుకు వస్తున్నావ్ -నీ పెత్తనం ఏమిటి ఇక్కడ .. అని అంటున్నావు కదా .. నువ్వు చదువుకున్నావు కదా – నీకు బుద్ధి -జ్ఞానం లేవా ? ఎమ్మెల్యే అనేవారు ఏ సమావేశానికి అయినా వచ్చే హక్కు రాజ్యాంగం కల్పించింది అనే సంగతి నీకు తెలియదా ..
గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు కౌన్సిల్ సమావేశాలకు రాలేదా ? .. ఆమె ఎమ్మెల్యే హోదాలో కౌన్సిల్ సమావేశానికి వస్తే అవమానించి పంపించింది మీరు కాదా ..ఆమె కన్నీళ్ళతో సమావేశం నుండి బయటికి వెళ్లలేదా ? ..
మీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారిని తీవ్రంగా అవమానపరుస్తూ మీ అడుగుజాడల్లో ఆమె నడిచే విధంగా గత తెలుగుదేశ ప్రభుత్వంలో మీరు పాలన చేశారు .. కానీ నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో పని చేస్తున్న మా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం .. అది మీకు -మాకు ఉన్న తేడా ..
కౌన్సిల్ సమావేశాలలో చిత్ర విచిత్ర వేషాలతో , విన్యాసాలు చేస్తూ తోటి సభ్యులపై వాటర్ బాటిల్ లు విసురుతూ – వేలు చూపిస్తున్నారు -ముక్కు అంటున్నారు అంటూ ఏవేవో మాట్లాడుతున్న స్వర్ణలత ..నీ ప్రవర్తన అంతా తోటి సభ్యులు -అధికారులు -మీడియా వారు- నందిగామ సమాజం చాలా జాగ్రత్తగా గమనిస్తుంది .. నీ మానసిక పరిస్థితి బాలేదు .. దయచేసి ఆస్పత్రిలో చికిత్స పొంది తదుపరి సమావేశాలకు హాజరు కావలసిందిగా మనవి చేస్తున్నాం ..
అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతుంటే ఎస్సీలు మాట్లాడుతున్నారు – ఎస్సీ సభ్యులు గొడవ చేస్తున్నారు అని మాట్లాడుతున్న శాఖమూరి స్వర్ణలత .. సాటి సభ్యులు కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడుతుంటే వారి కులం ఎంచి – ఎస్సీలు ఎస్సీలు అని హేళన చేస్తూ నీ అగ్రకుల అహంకార ఆధిపత్యంతో నువ్వు మాట్లాడుతున్న మాటలు నందిగామ సమాజం గమనిస్తూనే ఉంది .. కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న మీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అందరూ ఏ సామాజిక వర్గం .. అందుకేనా మీరు పదేపదే ఎస్సీలు- ఎస్సీలు అంటుంది ..
కనీసం కౌన్సిల్ ఎజెండా ఆమోదం అవకుండానే – వర్క్ ల బిల్లులు రాకుండానే కమిషన్లు తాడేపల్లికి పోతున్నాయా , ఎమ్మెల్యే ఇంటికి పోతున్నాయా , సజ్జల దగ్గరికి పోతున్నాయా అని మాట్లాడుతున్నావ్ .. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నందిగామ కమిషన్లు చంద్రబాబు ఉండే కరకట్టకు వెళ్లాయా ? మీ చిన్న బాబు లోకేష్ కి వెళ్లాయా ? మీ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాయా చెబితే బాగుంటుంది .. గత మీ ప్రభుత్వంలో వెళ్లినట్టు అదే భ్రమలో ఉండి నేడు పోతున్నాయి అని నీకు నువ్వే అనుకుంటూ ఏవేవో మాట్లాడుతున్నావ్ ..
కౌన్సిల్ సమావేశంలో మా పార్టీకి చెందిన చైర్ పర్సన్ తో మా పార్టీ సభ్యులు ,మా ఎమ్మెల్యే మాట్లాడుతుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి శాఖమూరి స్వర్ణలత .. ఆమెతో నీకు లోపాయికారి ఒప్పందం ఏమైనా ఉందా .. లేకపోతే ఆమె మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నువ్వు ఒకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నావా ..
నందిగామ పట్టణంలో తాగునీటి సరఫరాకు 30 ఏళ్ల కింద వేసిన పైపులైన్లు ద్వారానే నీళ్లు సరఫరా అవుతున్నాయి .. అప్పటి నందిగామ జనాభా ఎంత ..నేడు నందిగామ జనాభా ఎంత .. జనాభా ఎన్నో రెట్లు పెరిగినా అవే పురాతన పైపులైన్లు ఉన్న కారణంగా నీటి సరఫరా లో అవాంతరాలు ఎదురవుతున్న విషయం నందిగామ ప్రజలందరికీ తెలుసు .. గత మూడేళ్లుగా కొత్త పైపులైన్లు వేస్తూ ..జల జీవన్ మిషన్ ద్వారా పైపులైన్ నిర్మాణానికి చర్యలు తీసుకొని .. ఇబ్బంది ఎదురైన చోట ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్న .. కావాలని బురద చల్లాలని నీళ్లు రావట్లేదు నీళ్లు రావట్లేదు అని అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నావు .. అజెండాలో లేని అంశాలపై మాట్లాడుతూ- విలువైన ప్రజా సమయాన్ని వృధా చేస్తూ – రసాభాస చేయాలనే ఆలోచనతో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నందిగామ సమాజం చూస్తూనే ఉంది ..
నందిగామ టౌన్ : తెదేపా కౌన్సిలర్లు మరియు శాఖమూరి స్వర్ణలత వ్యాఖ్యలను ఖండిస్తూ నందిగామ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసిపి కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన సమావేశ వివరాలు ..