YSRCP Nandigama : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుభూతి కోసం కొత్త డ్రామాలకు తెరలేపడం అత్యంత దౌర్భాగ్యం

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.04-11-2022(శుక్రవారం) ..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుభూతి కోసం కొత్త డ్రామాలకు తెరలేపడం అత్యంత దౌర్భాగ్యం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

నందిగామ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై మండిపడిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

రాళ్లు వేసింది తెలుగుదేశం పార్టీ నాయకులే .. వేయించుకుంది మీ నాయకులే .. వైసిపి పార్టీ వారు రాళ్ల దాడి చేశారని నీచమైన ఆరోపణలు చేయడం హేయనీయం ..

రోడ్ షోలో భారీగా జనం తరలివచ్చారని మీరే చెబుతున్నారు , మీ చుట్టూ మీ వాళ్లే ఉంటే అంత దగ్గరగా వేరేవాళ్లు రాయి విసరటం సాధ్యమా ? .. అసలు రాయి వేయలేదు ,కింద ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ని పైకి తీసుకువచ్చి రక్తం వస్తుందని డ్రామా రక్తి కట్టించడానికి చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనలు చేశాడు ..

చంద్రబాబు నాయుడు ,తంగిరాల సౌమ్య ఆరోపించినట్టు మేము అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే నందిగామ శివాలయంలో కానీ మీరు ఎంచుకున్న చర్చిలో కానీ నేను మరియు నా సోదరుడు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం ,మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ప్రమాణానికి సిద్ధమా ..? అని ప్రశ్నించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాన్ని విని తెలుగు తమ్ముళ్లు నీరు కారిపోయారు .. తమ్ముళ్లు వింటున్నారా అంటూ పదే పదే అడుగుతున్నప్పటికీ ఎదురుగా ఉన్న తమ్ముళ్ళ నుండి స్పందన రాకపోవడం చూస్తుంటే ఆయన మాట్లాడుతున్నది అసత్యాలని ప్రజలకు అర్థమవుతుంది ..

చంద్రబాబు నాయుడు రోడ్ షో ప్లాప్ అవుతుందని గమనించిన తెలుగు తమ్ముళ్లు , డబ్బు మూటలతో కాలనీలకు వెళ్లి మనిషికి రూ.500 చొప్పున ఇచ్చి జనాన్ని తెచ్చుకున్న మాట వాస్తవం కాదా ? ..

ఒకపక్క డబ్బులు ఇచ్చి కూలీలతో పూలు చల్లించుకుంటూ , మరోపక్క చంద్రబాబు నాయుడు పై పూలు చల్లదంటూ చెప్పించుకుంటూ ఆయన తన నటన సాఫల్యాన్ని చాటుకున్నారు ,చంద్రబాబు నాయుడుని సినిమాల్లో పెడితే ఎన్టీఆర్ కి అసలైన వారసుడిలా నటించే వారిని , రాజకీయాల్లో ఈ విధంగా నటించడం చంద్రబాబు కే చెల్లిందన్నారు ..

సుబాబుల రైతుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యస్పదమని , సుబాబుల రైతులు రోడ్డున పడటానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం కాదా ? ..అని ప్రశ్నించారు .. చంద్రబాబు నాయుడు హయాంలో రైతులకు ఇవ్వవలసిన వైయస్ జగన్ ప్రభుత్వంలో బకాయిలను ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిది ..

నందిగామలో ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాసుపత్రికి వచ్చినప్పుడు మీరు చేసినట్లుగా ..నేడు మేము చేసి ఉంటే మీరు నందిగామలో పర్యటించేవారా ? .. అని ప్రశ్నించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

నందిగామ లో మా పరిపాలనలో అభివృద్ధి చేసి విస్తరించిన రోడ్లపై మీరు రోడ్ షోలు చేసుకుంటూ , అభివృద్ధి లేదని మాట్లాడటం సిగ్గుచేటు .. గతంలో మీ పరిపాలనలో ఉన్న ఇరుకు సందుల్లో మీరు రావడానికి వీలవుతుందా ..?

చంద్రబాబు నాయుడు మరియు తెలుగు తమ్ముళ్లు తలకిందులుగా తపస్సు చేసిన నందిగామలో పసుపు జెండా ఎగరేయడం కలగానే మిగులుతుంది .. రాబోయే 30 ఏళ్లు నందిగామలో వైయస్ జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ..

నందిగామ టౌన్ : నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు రోడ్ షో మరియు బహిరంగ సభ వ్యాఖ్యలపై ఖండనగా విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

YSRCP Nandigama : పట్టణంలోని 10 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం..

Follow Us : Facebook,Twitter,Instagram

#ysrcp_nandigama

#mla_nandigama

#jagan_mohan_rao_monditoka

#mlc_nandigama

#arun_kumar_monditoka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *