Harish Rao : కేసీఆర్‌ను ఓడించేందుకు గజ్వేల్‌లో కుట్రలు చేశారు – హరీశ్ రావు

Best Web Hosting Provider In India 2024

Former Minister Harish Rao: గజ్వేల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభ నిర్వహించింది. ఇందుకు హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయని.. అన్ని రకాలుగా కుట్రలు జరిగాయని అన్నారు. కులాలు, మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయినా కూడా తమ పార్టీ కార్యకర్తలు… ఎంతో అద్భుతంగా పని చేసి కెసిఆర్ గెలుపు కోసం కృషి చేశారని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

అనేక కుట్రలు చేశారు….

“కేసీఆర్ పై 154 నామినేషన్లు వేశారు. అనేక కుట్రలు. విత్ డ్రా తర్వాత 47 మిగిలాయి. నాలుగు మిషన్ల ఏర్పాటు వల్ల కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. 18,750 ఓట్లు చితికిపోయాయి. మరో 2200 ఓట్లు కారును పోలిన రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయి. ఇన్ని కుట్రలు జరిగినా కేసీఆర్… 45 వేల మెజారిటీతో గెలిపించారు. మూడోసారి గెలుపు అందించారు. గజ్వేల్ ప్రజలందరికీ కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ తరుపున ధన్యవాదాలు. గజ్వేల్ అభివృద్ధి ఎంతో జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీలో గజ్వేల్ పై అక్కసు వెళ్లగక్కింది కాంగ్రెస్. కేసీఆర్ ఇక్కడ వచ్చాక తాగు, సాగు నీటి సమస్య లేదు. కేసులు తగ్గాయి. కుట్రలు తగ్గాయి. గత చరిత్రను తిరగ రాసింది బిఆర్ఎస్. ఒక్కనాడు కూడా కాంగ్రెస్ నాయకులపై కేసు పెట్టలేదు. గజ్వేల్ ఎలా బాగు చేయాలి అని నిరంతరం ఆలోచించారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నెల రోజుకు కాలేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు, కేసులు పెడుతున్నరు. కెసిఆర్ గజ్వేల్ ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తే, కాంగ్రెస్ వాళ్లు కేసులు, కుట్రలతో ముందుకు తీసుకెళుతున్నారు. డిసెంబర్ 9 న రుణమాఫీ అన్నారు, 4 వేలకు పించన్లు పెంచుతాం అన్నారు, కరెంట్ బిల్లు కట్టొద్దు అన్నారు. రైతు బంధు పెంచుతాం అన్నారు, వడ్లకు 500 బోనస్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నరు..ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నరు. ప్రగతి భవన్ లో 250 బెడ్ రూం అన్నారు, బంగారు బాత్ రూములు ఉన్నాయన్నారు. అక్కడ ఉంటున్న భట్టి గారు వాస్తవాలు చెప్పాలి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

ఎవరు కరెక్ట్…?

“కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తెస్తే దండుగ అన్నారు. ఉత్తకుమార్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం వేస్ట్ అన్నారు. మీ ముఖ్యమంత్రి వెళ్ళారు ఏం సమాధానం చెబుతారు…? బిజెపితో కోట్లాడతం అని దోస్తీ చేస్తున్నది ఎవరు. బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ ను ఓడగొట్టింది బిఆర్ఎస్ పార్టీ. ఈ దేశం ఆదానీ అంబానీ చేతుల్లో ఉందని, ఆదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నడని, ఈ ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలు ఉన్నయని రాహుల్ గాంధీ అంటడు. సాయంత్రం రేవంత్ రెడ్డి, ఆదాని కలిసి హగ్ ఇచుకుంటరు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటరు. రాహుల్ కరెక్టా, రేవంత్ కరెక్టా….? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమంటే బిజెపిపై కాంగ్రెస్ వాళ్లు ఎందుకు కొట్లాడం లేదు. మెడలు వంచుతామని చెప్పిన కాంగ్రెస్ వాళ్లు, బిజెపి కేంద్ర మంత్రుల మెడలో నేడు పూలదండలు వేస్తున్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది” అని హరీశ్ కామెంట్స్ చేశారు.

“ తెలంగాణ ఉద్యమంలో హైదరాబాదులో నన్ను పెట్టని పోలీస్ స్టేషన్ ఏ లేదు. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. ఉద్యమ సమయంలో అరెస్టై మెదక్ జైల్లో నాలుగు రోజుల పాటు ఉన్నాను. ధైర్యంగా ఉండండి, టిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. రైతుల్లో విశ్వాసం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సాగు నీరు, కరెంట్, రైతు బంధు అందించాలి. సాగు పెంచాలి. కెసిఆర్ కోలుకుంటున్నారు. త్వరలోనే గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కి వస్తారు. మీ అందరితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు పూర్తిస్థాయిలో సహకారం ఉంటుంది” అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

WhatsApp channel

టాపిక్

KcrTelangana NewsBrsTelangana AssemblyTelangana Assembly Elections 2023Telangana BjpTelangana CongressGajwel Assembly Constituency
Source / Credits

Best Web Hosting Provider In India 2024