Hanuman Collections: ఓవ‌ర్‌సీస్‌లో ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు రికార్డుల‌ను బ్రేక్ చేసిన తేజా స‌జ్జా – హ‌నుమాన్ ప్ర‌భంజ‌నం

Best Web Hosting Provider In India 2024

Hanuman Collections: రిలీజై వారం రోజుల అయినా బాక్సాఫీస్ వ‌ద్ద హ‌నుమాన్ జోరు ఆగ‌డం లేదు. థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షం కురిపిస్తోన్న ఈ మూవీ క‌లెక్ష‌న్స్ ప‌రంగా రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. తాజాగా ఓవ‌ర్‌సీస్‌లో హ‌నుమాన్ కొత్త రికార్డును నెల‌కొల్పింది. మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేనుతో పాటు ప్ర‌భాస్ సాహో, ఆదిపురుష్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఏడు రోజుల్లో అమెరికాలో హ‌నుమాన్ మూవీ 3.45 మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

 

ట్రెండింగ్ వార్తలు

అమెరికాలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన తెలుగు సినిమాల్లో ఒక‌టిగా హ‌నుమాన్ నిలిచింది. అమెరికాలో మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను మూవీకి 3.41 మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. మ‌హేష్ కెరీర్‌లో అమెరికాలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమా రికార్డును హ‌నుమాన్ వారంలోనే దాటేసింది. అమెరికాలో ప్ర‌భాస్ సాహో 3. 23 మిలియ‌న్లు, ఆదిపురుష్ 3.16 మిలియ‌న్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ఆ సినిమాల రికార్డుల‌ను హ‌నుమాన్ బ్రేక్ చేసింది.

బాహుబ‌లి 2 టాప్‌…

అమెరికాలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో బాహుబ‌లి 2 టాప్‌లో ఉంది. బాహుబ‌లి 2 మూవీకి 20.75 మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఆ త‌ర్వాత 14 మిలియ‌న్ల‌తో ఆర్ఆర్ఆర్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. స‌లార్ 8.90 మిలియ‌న్ డాల‌ర్ల‌తో స‌లార్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో హ‌నుమాన్ ఏడో ప్లేస్‌ను ద‌క్కించుకున్న‌ది.

ఫ‌స్ట్ వీక్‌లో క‌లెక్ష‌న్స్ అదుర్స్‌…

హ‌నుమాన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొడుతోంది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ మూవీ 15 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈస్ట్ గోదావ‌రిలో 3.4 కోట్లు, ఉత్త‌రాంధ్రలో 4.1, నెల్లూరులో కోటి మూడు ల‌క్ష‌లు, కృష్ణాలో కోటి ఎన‌భై ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫ‌స్ట్ వీక్‌లో 130 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. గురువారం రోజు ఈ మూవీ 9.45 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇండియాలో 93 కోట్లు, ఓవ‌ర్‌సీస్‌లో 37 కోట్ల క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వారం రోజుల్లోనే నిర్మాత‌ల‌కు న‌లభై కోట్ల వ‌ర‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

 

జాంబీరెడ్డి త‌ర్వాత…

హ‌నుమాన్ మూవీకి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తేజా స‌జ్జా, అమృత అయ్య‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషించింది. విన‌య్ రాయ్ విల‌న్‌గా న‌టించాడు. హ‌నుమాన్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 సొంతం చేసుకున్న‌ది. మార్చిలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.జాంబీరెడ్డి త‌ర్వాత ప్ర‌శాంత్ వ‌ర్మ‌, తేజా స‌జ్జా కాంబినేష‌న్‌లో రూపొందిన మూవీ ఇది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024