Prawns Gravy Recipe: రొయ్యల ఇగురు ఇలా చేశారంటే కొంచెం కూడా మిగలదు, రెసిపీ చాలా సులువు

Best Web Hosting Provider In India 2024

Prawns Gravy Recipe: రొయ్యల ఇగురు పేరు వింటేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ రొయ్యలు ఇగురును కలుపుకొని ఒక్కో ముద్ద తింటూ ఉంటే ఆ టేస్టే వేరు. కానీ రొయ్యల ఇగురు చేయడం వచ్చినవారు చాలా తక్కువ మంది. ఉల్లి ముద్ద వేసి, రొయ్యలు వేసి ఉడికించేసేవారే ఎక్కువమంది. నిజానికి రొయ్యలు ఇగురుకి టేస్ట్ రావాలంటే ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ రావాలి. అలా అని ఇది చాలా కష్టమైనది కాదు. సింపుల్ గానే చేసేయొచ్చు. రొయ్యలు ఇగురును సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని ఇక్కడ ఇస్తున్నాం.

ట్రెండింగ్ వార్తలు

రొయ్యల ఇగురు రెసిపీకి కావలసిన పదార్థాలు

రొయ్యలు – కిలో

ఉల్లిపాయలు – నాలుగు

అల్లం వెల్లుల్లి పేస్టు – మూడు స్పూన్లు

కారం – ఒక స్పూను

పసుపు – అర స్పూను

ఉప్పు – రుచికి సరిపడా

కరివేపాకు – గుప్పెడు

టమాటాలు – మూడు

కొబ్బరి పాలు – ఒక కప్పు

పచ్చిమిర్చి – నాలుగు

నూనె – తగినంత

రొయ్యల ఇగురు రెసిపీ

1. రొయ్యలను బాగా శుభ్రం చేసి ఉప్పు, పసుపు వేసి కడగాలి.

2. తరువాత ఒక గిన్నెలో వేసి కాస్త ఉప్పు, పసుపు వాటికి పట్టించి అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టాలి. నూనె వేసి అరగంట పాటు నానబెట్టుకున్న రొయ్యలను వేయాలి.

4. రొయ్యలను బాగా వేయించాలి. వేయించిన రొయ్యలను తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఆ మిగిలిన నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా వేయించాలి.

6. అవి రంగు మారిన తర్వాత కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నిలువుగా కోసిన పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇదంతా ఇగురులా అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేయాలి.

8. ఇప్పుడు అరకప్పు నీళ్లను వేసి కలపాలి. మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

9. ఇప్పుడు టమోటాలను మిక్సీలో వేసి ప్యూరీలా మార్చుకోవాలి.

10. ఆ టమోటా ప్యూరీని రొయ్యల ఇగురులో వేసి మరొక పది నిమిషాలు ఉడికించాలి.

11. ఆ తరువాత కొబ్బరి పాలను వేసి బాగా కలపాలి. ఓ పది నిమిషాలు మళ్లీ మూత పెట్టి ఉడికించాలి.

12. ఇగురు దగ్గరగా అయ్యాక పైన కొత్తిమీర జల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే రొయ్యలు ఇగురు రెడీ అయినట్టే.

13. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యలు ఇగురును తిని చూడండి… ఆహా అనిపిస్తుంది.

రొయ్యలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే. అయితే కొంతమందికి మాత్రం రొయ్యలు ఎలర్జీ ఉంటుంది అలాంటివారు రొయ్యలను దూరంగా పెట్టడమే మంచిది. మీకు రొయ్యలు అలెర్జీ లేకపోతేనే వీటిని తినేందుకు ప్రయత్నించండి.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024