ఇవేం రోత రాతలు రామోజీ..!?

Best Web Hosting Provider In India 2024

మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ట్వీట్‌

అన‌కాప‌ల్లి: భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని పరిపాలి­స్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 56 నెలలుగా ఆవిష్కరించిన సామాజిక మహా విప్లవంతో రాష్ట్రమంతటా సాధికారత ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు సింహభాగం అవకాశాలతో దూసుకెళుతుండటం ఇందుకు నిదర్శనం. ముఖ్య­మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అనుసరించాల్సిన విధానమని వైయ‌స్ జగన్‌ స్పష్టం చేశారు. తొలి మంత్రివర్గం ఏర్పాటులోనే దీన్ని రుజువు చేశారు. అంబేడ్కర్‌ సిద్ధాంతాలను ప్రతి అడుగులో ఆచరిస్తూ సామాజిక న్యాయం చేయడంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ దేశా­నికే ఆదర్శంగా నిలిచారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. దార్శ‌నికుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ దివ్య‌స్మృతికి స‌ముచిత గౌర‌వం ఇస్తూ ప్రపంచంలోనే ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహానికి రూపకల్పన చేసి నేడు విగ్రహావిష్కరణ చేస్తున్న త‌రుణంలో ఈనాడు ప‌త్రిక అంబేద్క‌ర్ విగ్ర‌హంపైనా విషం చిమ్మ‌డానికి ప్ర‌య‌త్నం చేసింది. ఇవాళ ఈనాడులో వ‌చ్చిన క‌థ‌నాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ట్వీట్ చేశారు.
ఈనాడు పత్రికా లేక.. !
చంద్రబాబు టాయిలెట్ పేపరా..!!
మనందరి ముఖ్యమంత్రి జగన్ గారు విజయవాడ నడిబొడ్డున రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నంగా..
ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ మహా శిల్పం నెలకొల్పడంతో రామోజీకి పచ్చ కామెర్లు వచ్చాయి.
అందుకే అంబేడ్కర్ విగ్రహంపైనా విషం చిమ్మటానికి బరితెగించాడు. 
ఈ వయసులో ఇదేం పాడు పని.. ఇవేం రోత రాతలు రామోజీ..!?
అంటూ మంత్రి ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

Best Web Hosting Provider In India 2024