Best Web Hosting Provider In India 2024
Chiranjeevi in OTT: చిరంజీవి అంటే వెండితెర మెగాస్టార్. నాలుగు దశాబ్దాలకుగాపై సిల్వర్ స్క్రీన్ ను ఏలుతున్న ఈ జగదేక వీరుడు ఇక ఇప్పుడు ఓటీటీల వైపు చూస్తున్నాడు. ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది కదా. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లోని పెద్ద పెద్ద స్టార్లు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ పై సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఏవీ దొరక్కపోతే రియాల్టీ షోలు కూడా చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
సరైన కథ కోసం చిరు వెయిటింగ్
సిల్కర్ స్క్రీన్ పై కథ లేకున్నా మాస్ ఎలిమెంట్స్, డ్యాన్స్ లు, పాటలు, ఫైటింగులతో సినిమాలు నెట్టుకొస్తున్నాయి. కానీ ఓటీటీలో అలా కాదు. ఇక్కడ కంటెంటే కింగ్. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా అలాంటి కథ కోసం వేచి చూస్తున్నాడట. ఇప్పటికే పలువురు రచయితలకు తనకు తగిన కథను సిద్ధం చేయాలని అడిగాడు. అది కూడా మంచి క్రైమ్ డ్రామా కోసం చిరు వెతుకుతుండటం విశేషం.
క్రైమ్, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ కు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. దీంతో చిరంజీవి కూడా అలాంటి బలమైన కథ కోసం చూస్తున్నాడు. అందులోనూ తన వయసుకు తగిన పాత్ర కావాలని కూడా అతడు పట్టుబడుతున్నాడు. చిరు అంటే ఎప్పటి నుంచో డ్యాన్స్, ఫైట్స్ కు కేరాఫ్. కానీ ఓటీటీలో మాత్రం అది కుదరదు. అందుకే ఇక్కడ తన వయసుకు తగిన కథ, పాత్ర తప్పనిసరి అని మెగాస్టార్ గుర్తించాడు.
ఓటీటీలు వచ్చిన మొదట్లో వీటిపై చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపలేదు. తనది సిల్వర్ స్క్రీన్ ఫిగర్ అని, ఓటీటీ తనకు సరిపడదని అప్పట్లో అతడు భావించాడు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తు ఓటీటీదే అని గుర్తించి చిరు మెల్లగా ఇటువైపు చూస్తున్నట్లు అతని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఓటీటీ ఫాలో అవుతున్న చిరు
చిరంజీవికి ఈ మధ్య మోకాలి సర్జరీ అయినప్పటి నుంచీ ఓటీటీ కంటెంట్ బాగా చూస్తున్నట్లు చిరు టీమ్ సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు ఓటీటీప్లే (OTTPlay) వెబ్సైట్ తన రిపోర్టులో తెలిపింది. “సర్ మోకాలి సర్జరీ చేయించుకున్నప్పటి నుంచీ ఓటీటీ కంటెంట్ చాలా చూస్తున్నారు. అందుకే తాను కూడా డిజిటల్ స్పేస్ లో ఏదైనా చేయాలని భావిస్తున్నారు. దీనికోసం తన ఇమేజ్ ను పక్కన పెట్టడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకు తగిన బలమైన పాత్ర, కథ కోసం చూస్తున్నారు” అని ఆ వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో ఓటీటీలోకి చిరంజీవి ఎలాంటి కథతో ఎంటరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చిరు తన నెక్ట్స్ మూవీ విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఈ మధ్యే రిలీజైంది. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.