Neru ott release: గుడ్ న్యూస్.. తెలుగులోనూ ఓటీటీలోకి నేరు మూవీ

Best Web Hosting Provider In India 2024

Neru ott release: మలయాళంలో గత నెలలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన మోహన్ లాల్ నేరు మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే మొదట కేవలం మలయాళంలో మాత్రమే రిలీజ్ అవుతుందనకున్న ఈ సినిమా తెలుగులోనూ రాబోతుండటం విశేషం. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

మోహన్ లాల్ నటించిన ఈ నేరు మూవీ జనవరి 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. గురువారమే (జనవరి 18) ఈ విషయం బయటకు వచ్చినా.. మొదట్లో కేవలం మలయాళంలో మాత్రమే అని అనౌన్స్ చేశారు. అయితే ఆ కాసేపటికే తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ తెలిపింది.

నేరు.. ఓ కోర్టు రూమ్ డ్రామా

మోహన్ లాల్, ప్రియమణి నటించిన ఈ నేరు మూవీని దృశ్యం మూవీ ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు. ఇదొక కోర్టు రూమ్ డ్రామా. ఈ సినిమాకు మలయాళంలో మంచి రివ్యూలు వచ్చాయి. తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేయబోతున్నాడని, అందుకే తెలుగు వెర్షన్ ఓటీటీలోకి రావడం లేదని మొదట వార్తలు వచ్చాయి. కానీ తాజాగా హాట్ స్టార్ మాత్రం తెలుగులోనూ మూవీ చూడొచ్చని తెలిపింది.

ఈ నేరు మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.86 కోట్లకుపైగా వసూలు చేసింది. ఒక్క కేరళలోనే రూ.47 కోట్లు రాబట్టడం విశేషం. మోహన్ లాల్ కెరీర్లో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ నేరు నిలిచింది. థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తెలుగులోనూ ఈ మూవీ రానుండటం నిజంగా గుడ్ న్యూసే.

నిజానికి ఈ నేరు మూవీ కేరళలో సలార్ కు పోటీ రిలీజైనా దానిని తట్టుకొని మంచి వసూళ్లు సాధించింది. నేరు ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు తావు లేని రియ‌లిస్టిక్ కోర్టు డ్రామా మూవీ. మోహ‌న్ లాల్ న‌ట విశ్వ‌రూపానికి చ‌క్క‌టి నిద‌ర్శ‌నంగా ఈ సినిమా నిలుస్తుంది. ఫైట్లు, పాట‌లు, కామెడీ ట్రాక్ వంటి క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేకుండా నిజంగానే కోర్టు వాద‌న‌ల‌కు క‌ళ్ల ముందు చూస్తున్న అనుభూతిని క‌లిగించేలా నేరు సిన‌మాను తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్‌.

అబ‌ద్దాల‌తో కేసు గెల‌వాల‌ని ప్ర‌య‌త్నించే లాయ‌ర్ ఓ వైపు…నిజం కోసం పోరాడే లాయ‌ర్ మ‌రోవైపు…ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తులు పై ఎత్తుల‌తో నేరు మూవీ థ్రిల్లింగ్‌ను పంచుతుంది. కోర్టుల్లో సామాన్యుడికి న్యాయం అందుతుందా? న‌్యాయ వ్య‌వ‌స్థ‌ను డ‌బ్బు, అధికారం ఎలా ప్ర‌భావితం చేస్తున్నాయ‌నే సందేశాన్ని అంత‌ర్లీనంగా నేరు మూవీలో చూపించాడు డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్‌.

మరోవైపు మోహన్ లాల్ ఈ నేరు తర్వాత డైరెక్టర్ లిజోతో మలైకొట్టాయ్ వాలిబన్ మూవీ చేశాడు. ఈ సినిమా జనవరి 25న రిలీజ్ కానుండగా.. గురువారమే మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో ఓ పవర్ ఫుల్ రెజ్లర్ గా మోహన్ లాల్ కనిపిస్తున్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024