Yevandoy Srimathigaru: 4 జీవితాలు, 2 కథలతో ఏవండోయ్ శ్రీమతిగారు.. సరికొత్త సీరియల్ ప్రారంభం

Best Web Hosting Provider In India 2024

Yevandoy Srimathigaru Serial: తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది జెమినీ టీవీ. ఎన్నో కార్యక్రమాలను, మరెన్నో సీరియల్స్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించిన జెమినీ టీవీ.. ఇప్పుడు సరికొత్త సీరియల్‌తో ముందుకు రానుంది. “ఏవండోయ్ శ్రీమతిగారు” అనే సరికొత్త కథాంశంతో బుల్లితెర ధారావాహిక తెలుగు రాష్ట్రాల ప్రజల టీవీల్లో మారుమోగిపోనుంది. ఏవండోయ్ శ్రీమతి గారు డైలీ సీరియల్‌ను జనవరి 22 నుంచి జెమినీలో ప్రసారం చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

గౌరవ మర్యాదలు కలిగిన గ్రామ సర్పంచ్ సుబ్బారాయుడి కుమార్తె మిథున పాత్రే ఏవండోయ్ శ్రీమతిగారు సీరియల్‌లో హీరోయిన్. మిథున పెళ్లిపీఠలపై నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో తండ్రి సుబ్బారాయుడిని ఊరి వాళ్లంతా అవమానిస్తారు. ఇది రెండోసారి జరగడంతో ఇద్దరి కూతుళ్లు తన నమ్మకాన్ని వొమ్ముచేసారు అని వాళ్ల ముందు నిలబడలేకపోతాడు సుబ్బారాయుడు. కొన్ని సంవత్సరాల తరువాత సిటీలో మిథున, గౌతమ్‌లు తమ తమ పిల్లలతో కలిసి అనుకోని పరిస్థితుల్లో భార్యాభర్తల్లా ఒక్కే ఇంట్లో అద్దెకు దిగుతారు.

అక్కడ ఆ భార్యాభర్తలు గౌతమ్, మిథున కలిసుంటారా లేక కలిసిపోతారా..? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా లేక ఎవరి దారి వాళ్లు చూసుకుంటారా.? నాలుగు జీవితాలు, రెండు కథలు, ఒకే ఇల్లు..! సరికొత్త కథతో సరికొత్త ధారావాహిక మన జెమిని టివిలో.. ఏవండోయ్ శ్రీమతిగారు ఈనెల 22న ప్రారంభం – సాయంత్రం 6.30 గంటలకు అంటూ సీరియల్‌ను ప్రచారం చేస్తున్నారు. కాగా ఏవండోయ్ శ్రీమతిగారు సీరియల్‌లో పల్లవి గౌడ, హర్షిత్ శెట్టి, మమ్మూటి శ్రీనివాస్, శాంతి, గుత్తి కొండ భార్గవ, దేవీశ్రీ, చైత్ర రాయ్, క్రిష్ణ, తదితర నటీనటులు నటించారు.

అయితే, ఈ నెల 22వ తేదీ సోమవారం సా 6:30 గం.లకు జెమిని టివి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఏవండోయ్ శ్రీమతిగారు సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందడంలో ఎలాంటి సందేహం లేదని జెమినీ టీవీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా అనేక సీరియల్లతో పల్లవి గౌడ మంచి పేరు తెచ్చుకుంది. సీరియల్‌లో ప్రతి పాత్రకు తగినట్లుగా నటిస్తూ ఆమె పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ సీరియల్‌తో పాటు జీ తెలుగులో నిండు నూరేళ్ల సావాసం ధారావాహికలో అరుంధతి పాత్రలో అలరిస్తోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024