చంద్రబాబుకు అంబేద్కర్‌ని తాకే అర్హత లేదు

Best Web Hosting Provider In India 2024

 మంత్రి ఆర్కే రోజా

విజ‌య‌వాడ‌: ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్‌ని తాకే అర్హత లేద‌ని మంత్రి ఆర్కే రోజా అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం వైయ‌స్‌ జగన్ చేస్తున్నార‌ని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా సీఎం వైయ‌స్ జగన్ ఆచరిస్తున్నారు. అద్భుతమైన అంబేద్కర్‌ విగ్రహాన్ని విజ‌య‌వాడ న‌డిబొడ్డున సీఎం వైయ‌స్ జగన్ ఏర్పాటు చేశార‌ని తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్‌కి వస్తున్న ప్రజా మద్దతు చూసి ఓర్వలేక పచ్చ పత్రికలు పిచ్చి రాతలు రాస్తోంద‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు 100 అడుగుల విగ్రహం పెడతానని పెట్టకుండా అంబేద్కర్‌ని అవమానించార‌ని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాల‌ని మంత్రి డిమాండు చేశారు. 

`వేమన  సామాజిక చైతన్యానికి స్పూర్తి`
సుమారు 350 సంవత్సరాల క్రితం మహాకవి వేమన పద్యాలు నేటికీ ఎంతో ప్రాచుర్యాన్ని పొందుతుండడం తెలుగువారిగా మన అదృష్టం, ఆ నాడు సమాజంలోని రుగ్మతలను పారద్రోలేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన పద్యాలతో `యోగివేమన` చైతన్యవంతం చేశారు ఈరోజు వారి జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు అంటూ మంత్రి రోజా సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

Best Web Hosting Provider In India 2024