Best Web Hosting Provider In India 2024

Prabhas Donates to Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రతిష్ఠా దినమైన జనవరి 22న అన్నదానానికి అయ్యే ఖర్చులను స్పాన్సర్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ప్రభాస్ టీం ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ఈ వార్తలను ఖండించింది.
ట్రెండింగ్ వార్తలు
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘డబ్బు సంపాదించి ఇతరులతో పంచుకోవాలని నిర్ణయించుకునే వ్యక్తి గొప్పవాడు. అలాంటి వారిలో ఒకరైన ప్రభాస్ అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చేందుకు అంగీకరించారు. హాజరయ్యే వారి కోసం భోజనాన్ని స్పాన్సర్ చేయడానికి ఆయన అంగీకరించారు అని చెప్పారు.
అయితే ఇవన్నీ ఫేక్ న్యూస్ అని ప్రభాస్ టీం ఇండియా టుడేతో తెలిపింది. ఈ ఆదిపురుష్ రాముడు.. అయోధ్య ఆలయానికి పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వలేదని, ప్రాణ ప్రతిష్ఠ రోజున ఆహారాన్ని స్పాన్సర్ చేయడానికి అంగీకరించలేదని వారు స్పష్టం చేశారు.
రామ మందిర ఆహ్వానం వీళ్లకే..
రజినీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్ వంటి దక్షిణాది తారలకు అయోధ్యకు ఆహ్వానం అందింది. అయితే ప్రభాస్ కు కూడా ఆహ్వానం అందిందో లేదో తెలియదు. జనవరి 22న రామాలయం ప్రతిష్ఠ అనంతరం జనవరి 23 నుంచి సాధారణ ప్రజల దర్శనం కోసం ఆలయం తెరుచుకోనుంది. అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్, అలియా భట్, రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, అనుష్క శర్మతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు, శ్రియారెడ్డిలతో కలిసి ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్ పార్ట్ 1’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ శనివారం (జనవరి 20) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ప్రభాస్ ఈ ఏడాది మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
మే 9న అతడు నటించిన కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు. ఇక మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ మూవీ కూడా రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ పై ఎలాంటి ప్రకటన లేకపోయినా.. డిసెంబర్ లో రావచ్చని భావిస్తున్నారు. సంక్రాంతి రోజే రాజాసాబ్ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రానుంది.