Best Web Hosting Provider In India 2024

సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోంది
దళితజాతికి, బహుళజనులకు అభినందనలు తెలియజేస్తున్నా.
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుంది.
సామాజిక న్యాయ మహా శిల్పం కింద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
అందరినీ ఒక్కతాటిపై నిలబెట్టామంటే అంబేద్కర్ స్పూర్తితోనే
ఈ మహా విగ్రహం అందరికీ స్పూర్తినిస్తుంది.
పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయి
అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదు.
పెత్తందారులకు దళితులంటే చులకన.
చంద్రబాబుకు దళితులంటే నచ్చదు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమ లేదు.
పేద అక్కచెల్లెమ్మలకు మేలు చేసేందుకు 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం.
మన ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదు.
దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదు
ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో అనిపిస్తుంది.
పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోకపోవడం అంటరాని తనమే.
పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే.
పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే.
పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా?
ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
పథకాలు అమలులో వివక్ష చూపించడం కూడ రూపం మార్చుకున్న అంటరానితనమే
అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన సీఎం వైయస్ జగన్
విజయవాడ: విజయవాడ నడిబొడ్డున ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని.. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో అనిపిస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టికోకపోవడం అంటరానితనమే. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే. పేదపిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదు. మన ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదు. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదని సీఎం వైయస్ జగన్ దుయ్యబట్టారు. శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
- ఈ రోజు మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్య వాడగా కనిపిస్తోంది. భారత్న బాబా సాహేబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
- ఇది న్యాయ మహా శిల్పం..ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు ..మాములుగా స్టాట్యూ ఆఫ్ లిబర్టి గురించి మాట్లాడేవారం. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ పేరు మారుమ్రోగుతుంది.
- మనందరి ప్రభుత్వం ఈ విగ్రహాన్ని 56 నెలల్లో అడుగడుగునా అనుసరించిన విధానాలకు కనిపిస్తోంది.అంబేద్కర్ జన్మించి 133 సంవత్సరాల తరువాత, ఆయన మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద ఈ రోజు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆలోచన చేయండి. ఎందుకు చేస్తున్నామంటే కారణం..ఈ విగ్రహం వేల సంవత్సరాల దేశ సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త. మరణం లేని ఓ నేత విగ్రహం ఈ రోజు విజయవాడలో ఆవిష్కతమవుతుంది.
- అంబేద్కర్ ఎప్పటికీ మనకు కనిపిస్తుంటారు. దేశంలో పెత్తందారి, అంటరానితనంపై, కుల వివక్షపై, దుర్మార్గులపై, అక్కచెల్లెమ్మలపై వివక్షలపై పోరాటాలకు ఈ మహామనిషి స్ఫూర్తినిస్తుంటారు.
- విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 75వ రిపబ్లిక్ డేకు వారం ముందు మనం ఆవిష్కరిస్తున్న అంబేద్కర్ మహా శిల్పం. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా పేదల హక్కులకు, మహిళల హక్కులకు, మానవ హక్కులకు, సమానహక్కుల ఉద్యమాలకు స్ఫూర్తినిస్తుంది.
- అంబేద్కర్ అంటారాని తనంపై, అధిపత్యంపై తిరుగుబాటకు భావజాలంగా ఈ విగ్రహం కనిపిస్తుంది. సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపంగా కనిపిస్తుంటారు.
- రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కాపాడే మహా శక్తిగా ఆయన కనిపిస్తుంటారు.
- తమ గొంతు వినిపించలేని అట్టడుగున వర్గాలకు, ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని, వారికి రిజర్వేషన్లు కల్పించాలని, చరిత్రగతినిమార్చిన కారకులు అంబేద్కర్. ఈ రోజు దళితజాతి నిలబడిందన్నా కూడా, రిజర్వేషన్లు కల్పించి వారిని ఒక తాటిపై నిలిపింది ఒక్క అంబేద్కర్‌స్ఫూర్తినే.
- అణగారిన వర్గాలకు ఈ విగ్రహం అండగా , తోడుగా నిలబడుతుంది. చదువుకునేందుకు వీలు లేదని తరతరాలకు అణచివేసిన వర్గాల్లో తాను జన్మించి, చదువుకునేందుకు తమకు మాత్రమే హక్కు ఉందని భావించిన వారి కంటే గొప్పగా చదివిని గొప్ప విద్యా వేత్త అంబేద్కర్.
- తాను చదువుకుంటున్న స్కూల్‌లో గ్లాస్‌తో నీరు తాగేందుకు వీలు లేదట. ఫ్యూన్ నీళ్లు పై నుంచి పోసేవారట. అంబేడ్కర్ చెప్పిన మాట వింటే బడికి ఫ్యూన్ రాకపోతే దప్పికతో బాధపడేవాడట. అలాంటి అంటరానితనాన్ని తాను స్వయంగా అనుభవించి, స్వాతంత్య్ర పోరాటం రూపమే అంబేద్కర్.
- అటువంటి పరిస్థితులు..స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా వేరు వేరురూపాల్లో అంటరానితనం ఉంది. ఆలోచన చేయండి. అంటరానితనం అంటే ఫలాన వ్యక్తులను భౌతికంగా ముట్టుకోవడమే కాదు..పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో..ఆ ప్రభుత్వ బడిని పాడుబడేలా పెట్టడం కూడా అంటరానితనమే. డబ్బులు ఉన్న పిల్లలకు ఒక మీడియం, పేదలకు మరో మీడియం అంటూ వివక్ష పాటించడమే అంటరానితనం. రూపం మార్చుకున్న అంటరానితనం ఇది. ఈ రోజుకు కూడా ఈ పెత్తందార్లు తమ పత్రికల్లో రాశారు. ఈ రోజు పొద్దునే చదివా.. అంబేద్కర్ తెలుగు మీడియం మాత్రమే ఉండాలన్నారట. ఈ పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలట. అంబేద్కర్ చదువుకుంది ఇంగ్లీష్ మీడియంలోనే. 4వ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధువులు పండుగ చేసుకున్నారట. కానీ ఈ ఈనాడు పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరానితనాన్ని అబద్ధాలతో మేకప్ వేయాలని దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి వారు చరిత్రను వక్రీకరిస్తూ రాతలు రాస్తున్నారు. ఏ స్థాయికి పాత్రికేయం పడిపోయిందో ఆలోచన చేయండి.
- పేద కులాలు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారిగానే ఉండాలట. తమకు సేవలకులుగా ఉండిపోవాలట. చిన్న చిన్న వ్యాపారాలు, వృత్తులు చేసేవారిగానే వారు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు ఉన్నవారంతా రూపం మారిన అంటరానితనమే.
- పేదలకు ఉచిత వైద్యం అందే ఆసుపత్రులను నీరుగార్చడం, ఆర్టీసీని ప్రైవేట్‌కు అమ్మేయాలనుకోవడం రూపం మారిన అంటరానితనమే. ఏ పౌరసేవలు అందాలన్నా పేదలు లంచాలు ఇచ్చుకుంటూ, కార్యాలయాల చుట్టూ తిరగడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
- అవ్వాతాతలకు పింఛన్లు కావాలన్నా, రైతులకు ఎరువులు కావాలన్నా..పెద్ద పెద్ద క్యూలైన్లలో నిలబడి చివరికి గుండె ఆగినా ఆ పాలకుల మనసు మారలేదు. ఇవన్నీ కూడా అంటరానితనంలో భాగమే.
- ఎస్సీల అసైన్డ్‌భూములను కూడా కాజేసి గజాల చొప్పున అమ్ముకోవాలని, రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు లేకుండా చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
- పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఇది కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
- మన పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. ఇది కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలకు ట్యాబ్‌లు ఇస్తే చూడకూడనివి చూస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
- స్వాత్రంత్యం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా కూడారూపం మార్చుకున్న అంటరానితనంపై ఈ 56 నెలలుగా మనం చేస్తున్న ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనం అంబేద్కర్ విగ్రహమే.
- ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహమని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇది 81 అడుగుల వేదికపై ఏర్పాటు చేశాం. 206 అడుగుల ఎల్తైన ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది.
- తరతరాలు కూడా ఆకాశమంతటి మహానుభావుడి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం.. అంబేద్కర్ భావజాలం..ఇది మన పెత్తందార్లకు నచ్చదు.
- దళితులకు చంద్రబాబు సెంట్ భూమి ఇచ్చింది లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది అంతకన్నా లేదు. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీపై ఏ కోశానా కూడా ప్రేమే లేదు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అంటుంటే..గ్రామాల్లో ఎస్సీలు ఎలా బతుకుతారు. బీసీల తోకలు కత్తరిస్తా..కబడ్డార్ అన్న ఈ వ్యక్తి ..మన మాదిరిగా ఈ పేదలు బాగుండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. పెత్తందారి పార్టీలకు, పెత్తందారీ నాయకులకు చదువుకునే పిల్లలకు అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్దా, ట్యాబులు ఇవ్వాలని, ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలని , డిజిటల్ క్లాస్ రూములు, ఐఎఫ్ ఏర్పాటు చేయాలని, మన బడుల రూపురేఖలు మార్చాలని ఇలాంటి వారికి ఎందుకు అనిపిస్తుంది. పెత్తందారి పార్టీలకు దిశా యాప్ తీసుకురావాలని, వైయఆర్ చేయూత, ఆసరా, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎందుకు అనిపిస్తుంది.
- పెత్తందారి పార్టీలకు, నాయకులకు మన రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, రైతు భరోసా సాయం చేయాలని, ఆర్‌బీకే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపిస్తుంది.
- పేదలకు వైద్యం, మెరుగైన వైద్యం అందించాలని పెత్తందార్లకు ఎందుకు ఉంటుంది. గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయాలని, ఆసుపత్రుల రూపురేఖలు మార్చాలని ఎందుకు అనిపిస్తుంది. ఏకంగా 53 వేల మంది డాక్టర్లను నియమించాలని ఈ పెత్తందారీ పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది.
- గ్రామ స్థాయిలోనే వివక్ష లేని, లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలని, గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని పెత్తందారీ పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది..ఆలోచన చేయండి.
- ఈ పెత్తందారీ పార్టీలకు, నాయకులకు నామినెటెడ్ పోస్టులు, కాంట్రాక్టు పనులను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారీటీలకు 50 ఇవ్వాలని వారికి ఎందుకు అనిపిస్తుంది.
- మీ బిడ్డ మంత్రి మండలిలో నాలుగు డిప్యూటీ సీఎంపదవులు మనం ఇచ్చాం. ఏకంగా 68 శాతం మంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మనం ఇస్తే..సామాజిక పరంగా దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 56 నెలల్లో అడుగులు పడ్డాయి. స్పీకర్‌గా బీసీ నాయకుడు, శాసనమండలి చైర్మన్‌గా ఓ ఎస్సీ నాయకుడిని నియమించాం. డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఓ మైనారిటి మహిళను నియమించాం.
- మన పార్టీ శాసన మండలిలో 43 మందిలో 29 మంది నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీఅన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే. జెడ్పీ చైర్మన్లుగా నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే. 17 మున్సిపల్ మేయర్లలో 12 మంది నా నా…అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 84 పురపాలక సంఘాల్లో 58 నా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. 196 మార్కెట్ కమిటీ చైర్మన్లలో 117 మంది నా నా నా వర్గాలే ఉన్నారు.137 కార్పొరేషన్ పదవుల్లో నా నా అని పిలుచుకునే నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే ఉన్నారు. రాజకీయ పదవుల్లో సగానికి పైగా నా అక్క చెల్లెమ్మలు ఉన్నారని ఈ రోజు గర్వంగా చెబుతున్నాను.
- మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 56 నెలల్లో ఏకంగా 2.10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 87 శాతం నా నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ తమ్ముళ్లు, చెల్లెల్లు ఉన్నారు.
- ఈ రోజు ఈ పెత్తందారీ పార్టీలకు, నాయకులకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీల కోసం నవరత్నాల పాలన అందించాలని కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి అవ్వతాతల వరకు ప్రేమానురాగాలు పంచాలని వీరికి ఏ రోజైనా అనిపించిందా? మీ బిడ్డ పాలనలో రూ.2.45 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తున్నాను.
- రాష్ట్రాన్ని దోచుకునేందుకు మాత్రమే, పదవులు కావాలని ఆకాంక్షించే ఈ పెత్తందారీ నాయకులకు ఇలా బటన్ నొక్కి రూ.2.45 లక్షల కోట్లు ఇవ్వవచ్చు అని ఏ రోజైనా ఆలోచన చేశారా? ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు.
- ఈ రోజు గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వులతో వలంటీర్లు కనిపిస్తారు. ప్రతి ఒక్కరిని చేయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు. గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని దేశానికి చూపిస్తున్నారు.విప్లవంగా పుట్టిన వ్యవస్థలు మనం ఆచరించే విధానాలకు ప్రతిరూపంగా ఈరోజు మనం నిర్మించుకున్న అంబేద్కర్ విగ్రహమని గర్వంగా చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వం, మీ కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం..ప్రతి గ్రామంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ఇంటింటా ఓ చదువుల విప్లవం, సాధికార విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో పరిపాలన సంస్కరణలు, పారిశ్రామిక విప్లవం కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య రంగంలో ఎప్పుడూ ఊహించని విధంగా మార్పు జరిగింది. డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. పేదల అభివృద్ధి, అభ్యున్నతికి దేవుడి దయ, ప్రజలందరీ చల్లని దీవెనలు కలకాలం ఉండాలని..ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నానని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.