YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.05-11-2022(శనివారం) ..
మృతి చెందిన ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం నుండి మంజూరైన ఎక్స్ గ్రేషియోను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు ..
నందిగామ పట్టణంలోని శాసనసభ్యుల వారి కార్యాలయంలో కేతవీరునిపాడు గ్రామానికి చెందిన కోట చిన్న ఆనందరావు , ఐతవరం గ్రామానికి చెందిన చలమాల సైదులు మండలం పరిధిలో ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తూ మృతి చెందడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి మంజూరైన ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియోను వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శనివారం అందజేశారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల సుందరమ్మ , ఐతవరం సర్పంచ్ నాయుడు ఉదయలక్ష్మి , ఉపాధి హామీ సూపర్వైజర్ , మండల పార్టీ కన్వీనర్ శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..