Hyderabad : మైనర్ బాలికపై కత్తితో దాడి.. ఆపై రైలు కిందపడి బాలుడు ఆత్మహత్య!

Best Web Hosting Provider In India 2024

Hyderabad Crime News: హైదరాబాద్ అంబర్ పేటలో ఘోరం జరిగింది. బర్త్ డే కేక్ కట్ చేయించలేదని ఓ మైనర్ బాలికపై ఓ మైనర్ బాలుడు కత్తితో దాడి చేసి ఆపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..బాగ్ అంబర్పెట్ లోని తురబ్ నగర్ కు చెందిన అంజయ్య కుమారుడు రమణ ( 16), మల్లికార్జున నగర్ కు చెందిన బాలిక (16) 10వ తరగతిలో క్లాస్మేట్స్. ప్రస్తుతం వీరు వేరువేరు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడుతున్న బాలుడు…. శుక్రవారం తన పుట్టినరోజు కావడంతో గురువారం అర్థరాత్రి 12 గంటలకు తనతో కేక్ కట్ చేయించాలని అబాలికను కోరగా ఆమె నిరాకరించింది.దీంతో ఆమెపై కోపం పెంచుకొని బాలికపై కత్తితో దాడి చేశాడు.అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన బాలిక సోదరుని కూడా గాయపరిచి అక్కడి నుండి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం విద్యానగర్ రైలు పట్టాలపై స్థానికులు బాలుడి మొండెం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

 

ట్రెండింగ్ వార్తలు

రాత్రి జరిగిన ఘటనపై భయాందోళనలతోనే బాలుడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్ లో మైనర్ బాలుడు…..

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపానికి లోనైన బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అడ్డగుట్ట డివిజన్ తుకారం గేట్ ఎంసిఎచ్ కాలనీ లో శుక్రవారం చోటుచేసుకుంది. తుకారంపేట్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…మురళి, లీలావతి దంపతులకు రాహుల్ (15) దుర్గ భవాని సంతానం. వీరిద్దరూ పిల్లలు మిక్స్ రైల్వే హైస్కూల్లో చదువుతున్నారు. మురళి మద్యానికి బానిస కావడంతో లీలావతి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆర్థిక సమస్యల కారణంగా వారి మధ్య తరచూ గొడవలు అయ్యేవి. ఈ క్రమంలోనే

గురువారం కూడా వారి మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపం తో రాహుల్ గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేరు సమయంలో ఇంటిపై కప్పకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసేపటి తరువాత ఇంట్లోకి వచ్చిన తల్లి లీలావతి రాహుల్ ను పలుమార్లు పిలిచినా పలుకక పోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా రాహుల్ ఉరేసుకొని కనిపించాడు.అతన్ని కిందకు దింపి గాంధీ ఆస్పత్రికి తరలించగా….. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

చిక్కడపల్లిలో విషాదం…

అమ్మమ్మ మందలించడంతో మనస్థాపానికి లోనైన బాలుడు ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సీతయ్య, ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.… రీసాల కుర్షిద్ ప్రాంతానికి చెందిన డి. రాజు, సరిత దంపతులకు కుమారుడు కళ్యాణ్(16),చిక్కడపల్లిలోని ఓ జువెలరీ షాపులో పనిచేస్తూ నెలరోజుల క్రితం మానేశాడు. 2013లో అతడి తల్లి సరిత అనారోగ్యంతో మృతి చెందగా……తండ్రి రాజు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. అప్పటినుంచి అమ్మమ్మ శంకరమ్మ ఇంట్లో ఉంటున్న కళ్యాణ్ కొద్దిరోజులుగా పనికి వెళ్లకపోవడంతో….. అమ్మమ్మ శంకరమ్మ మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన కళ్యాణ్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ – కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel
 

టాపిక్

 
HyderabadCrime NewsTelangana News

Source / Credits

Best Web Hosting Provider In India 2024