OTT: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ కామెడీ మూవీ.. అదిరిపోతున్న రెస్పాన్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Extra Ordinary Man OTT Response: నితిన్ హీరోగా నటించిన సూపర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్” డిజిటల్ ప్రీమియర్‌లో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. నిన్నటి నుంచి అంటే జనవరి 19 నుంచి ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ మూవీ ప్రముఖ ఓటీటీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సకుటుంబంగా ప్రేక్షకులు ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ సినిమాలోని ఎంటర్ టైన్ మెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు

ఆడియెన్స్‌ను ఎంటర్ టైన్ చేయడంలో నితిన్ ది స్పెషల్ స్టైల్. ఆ స్టైల్ ను ఉపయోగించుకుంటూ దర్శకుడు వక్కంతం వంశీ ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ చిత్రాన్ని నవ్వులతో నింపేశాడని నిర్మాతలు పేర్కొన్నారు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి క్యారెక్టర్ హ్యూమరస్‌గా క్రియేట్ చేశాడని అన్నారు. వక్కంతం వంశీ క్రియేట్ చేసిన అభినయ్ క్యారెక్టర్‌లో నితిన్ వందశాతం ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తండ్రితో కామెడీ టైమింగ్, హీరోయిన్ శ్రీలీలతో చేసిన రొమాంటిక్ కామెడీ, అదిరే యాక్షన్ సీన్స్.. అన్నింటిలో ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నట్లు వెల్లడించారు.

ఇక హీరోయిన్ శ్రీలీల అందం, నటన, డ్యాన్సులు ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌కు‌ అదనపు ఆకర్షణగా నిలిచాయని తెలుస్తోంది. తండ్రి పాత్రలో రావు రమేష్ చేసిన హంగామా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. రాజశేఖర్ స్పెషల్ రోల్ కూడా ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ మూవీని శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై ఎన్.సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించారు. ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్ సినిమాకు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హరీస్ జయ‌రాజ్ సంగీత అందించారు.

 

థియేటర్‌లో నితిన్ లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌ను చూడని ప్రేక్షకులంతా ఫ్యామిలీతో కలిసి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో వీక్షించొచ్చు. సినిమాలోని ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొంతవరకు ఎంజాయ్ చేయొచ్చు అని థియేటర్ ఆడియెన్స్ అంటున్నారు. అయితే, ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోన్న ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ సినిమాకు థియేటర్ ప్రేక్షకుల నుంచి ఫుల్ నెగెటివ్ టాక్ వచ్చింది. ట్రైలర్ మాత్రం అదిరిపోయేలా ఉన్న సినిమా మాత్రం నిరాశపరిచినట్లు పబ్లిక్ టాక్‌లో చెప్పారు.

ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌ సినిమాలో కామెడీ ఉన్న పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదని రివ్యూలు వచ్చాయి. చాలా వరకు సీన్స్ బోర్ కొట్టాయని, కథ బాగున్నా వక్కంతం వంశీ టేకింగ్ అస్సలు బాలేదని నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. దాంతో ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌ సినిమాకు ఆడియెన్స్ కరువు అయ్యారు. అలా ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌ సినిమాకు కలెక్షన్స్ అంతగా రాలేదు. దాంతో బాక్సాఫీస్ వద్ద ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌ మూవీకి దెబ్బ తగిలినట్లు అయింది.

ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌ మూవీకి రూ. 45 కోట్లు బడ్జెట్ కాగా.. మొత్తంగా రూ. 7.91 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే నితిన్, నిర్మాతలు ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌ మూవీతో తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కానీ, ఇప్పుడు ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌ మూవీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకోవడం నిర్మాతలకు ఊరటనిచ్చే అంశం. అయితే, ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్నట్లు టాక్ వచ్చింది. కానీ, అనూహ్యంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్‌ విడుదలై స్ట్రీమింగ్ అవుతోంది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024